కాంగ్రెస్ వర్సెస్ బిజెపి.. ఓ ఆర్ఎస్ఎస్..

Update: 2025-12-29 08:15 GMT

దేశంలో ఇప్పుడు నేషనల్ పార్టీలు అంటే కాంగ్రెస్ బిజెపి మాత్రమే. అనాధి నుంచి ఈ రెండు పార్టీలు మాత్రమే దేశాన్ని రూల్ చేస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం జరుగుతోంది కదా.. ఈ సందర్భంగా కాంగ్రెస్ చరిత్ర గురించి అనేక విషయాలు మాట్లాడుతున్నారు. స్వాతంత్రం రాకముందే కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో కీలకపాత్ర పోషించిన చరిత్ర కాంగ్రెస్ కు మాత్రమే ఉంది. అలాంటి కాంగ్రెస్ నెహ్రూ, ఇందిరాగాంధీ సమయంలో కంటిన్యూగా దేశాన్ని పరిపాలించింది. తిరుగులేని శక్తిగా అవతరించింది. కానీ రాను రాను ఆ పట్టును నిలుపుకోలేకపోయింది. బిజెపి స్వాతంత్రం తర్వాత ఏర్పడినా సరే క్రమక్రమంగా బలపడుతూ వచ్చింది. మొదట్లో ఆ పార్టీకి ఒకటి రెండు సీట్లు వచ్చినా సరే ఎక్కడా కుంగిపోలేదు. క్రమక్రమంగా బలపడుతూ వచ్చింది. ఇప్పుడు దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకునే స్థాయికి ఎదిగింది బిజెపి పార్టీ.

బిజెపి ఈ స్థాయికి రావడానికి కారణం ఆర్ఎస్ఎస్. ఆ సంస్థ సిద్ధాంతాలు, దానికి ఉన్న కరుడుగట్టిన కార్యకర్తలు బిజెపికి అతిపెద్ద బలం. బిజెపి కార్యకర్తలు కంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అత్యంత క్రమశిక్షణతో పనిచేస్తారు. బిజెపి రెండుసార్లు ఆర్ఎస్ఎస్ సంస్థను బ్యాన్ చేసినా సరే తర్వాత దాని తప్పు లేదని తెలుసుకొని ఆ సంస్థకు అతిపెద్ద బలం అని గ్రహించింది. ఇప్పుడు ప్రతి ఎన్నికల్లో బిజెపి గెలుపులో అత్యంత కీలకంగా ఆర్ఎస్ఎస్ వ్యవహరిస్తూనే వస్తుంది. బిజెపిలో కిందిస్థాయి కార్యకర్తలకు కూడా కీలక పదవులు రావడం, కుటుంబ పాలన లేకపోవడం అతిపెద్ద ప్లస్ పాయింట్ అయ్యాయి. కాంగ్రెస్ లో ఇదే కరువైంది. ఆ పార్టీలో కుటుంబ పాలన అనేది ఎక్కువ కావడంతో ప్రతిపక్షాలు దాన్నే టార్గెట్ చేస్తూ వచ్చాయి. బిజెపి దాన్ని అతిపెద్ద అస్త్రంగా మలుచుకొని ప్రచారం చేసింది.

నరేంద్ర మోడీ ఒకప్పుడు కిందిస్థాయి చిన్న కార్యకర్తగా ఉన్నారు. ఆయన దేశ ప్రధానిగా చేయడమంటే మామూలు విషయం కాదు. ఇదే విషయాన్ని బిజెపి చెపుతూ తమ పార్టీలో ఒక సామాన్య కార్యకర్త కూడా ప్రధాని అయ్యే అవకాశం వస్తుంది అని.. తమది కుటుంబ పాలన కాదు అంటూ పదేపదే చెబుతోంది. దానికి తోడు హిందుత్వం పెరిగిపోవడం, ఆర్ఎస్ఎస్ బలంగా పనిచేయడం బిజెపికి బాగా కలిసి వచ్చాయి. ఇప్పుడు దాదాపు నార్త్ లో అన్ని రాష్ట్రాల్లో బిజెపి టాప్ పొజిషన్లో ఉంది. కానీ కాంగ్రెస్ అలా లేదు. చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్ష హోదాలో కూడా లేకుండా పోయింది. ఆ పార్టీలో నిరంకుశ వైఖరి దేనికి ప్రధాన కారణం అని ఎంతోమంది కార్యకర్తలు చెబుతున్నారు. కాంగ్రెస్ చాలా రాష్ట్రాల్లో నిలకడలేని రాజకీయాలు చేయడమే అతిపెద్ద మైనస్ అయింది. ఇప్పటికైనా దాన్ని మార్చుకుంటే ఆ పార్టీకి ఇంకా భవిష్యత్తు చాలానే ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Tags:    

Similar News