Gas Cylinder: రైలు పట్టాలపై మరోసారి గ్యాస్ సిలిండర్
లోకో పైలట్ అప్రమత్తతో తప్పిన ప్రమాదం;
ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం తప్పింది. రూర్కీ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ను గుర్తు తెలియని దుండగులు ఉంచారు. రైలు పట్టాలపై సిలిండర్‌ను గమనించిన గూడ్స్ రైలు లోకో పైలట్ అప్రమత్తమై ఎమర్జెన్సీ బ్రేక్స్ వేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. లలాండౌర్ – ధందేరా స్టేషన్ల మధ్య ఈ ఘటన శనివారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్‌లోని ధందేరా రైల్వే స్టేషన్ మీదుగా ఓ గూడ్స్ రైలు వెళ్తుండగా.. ఈ స్టేషన్‌కు సమీపంలో రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్‌ను అమర్చారు. లోకో పైలట్ అప్రమత్తమై ఎమర్జెన్సీ బ్రేకులు వేసి, ప్రమాదాన్ని తప్పించాడు. క్షణాల్లోనే అధికారులను అప్రమత్తం చేశాడు. ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు.. సిలిండర్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. అది ఖాళీదని నిర్ధారించారు. స్థానిక పోలీసులు, జీఆర్పీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానిక పోలీసులు, జీఆర్పీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అయితే ఈ ట్రాక్ వెంట సైనికులకు సంబంధించిన ఆర్మీ వాహనాలను తరలిస్తుంటారు. గూడ్స్ రైళ్లను కూడా సైనిక కార్యకలాపాల కోసం ఈ ట్రాక్‌ను వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక గ్యాస్ సిలిండర్ లభ్యమైన ప్రదేశం బెంగాల్ ఇంజినీర్ గ్రూప్ అండ్ సెంటర్‌కు దగ్గర్లోనే ఉంది.