Girl Suicide : టీచర్ వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య
విద్యార్థినిపై దొంగతనం నేరం మోపి.. బట్టలు విప్పించి..;
దొంగతనం నెపంతో ఓ టీచర్ విద్యార్థినిని తీవ్రంగా వేధింపులకు గురి చేసింది. దీంతో ఆ విద్యార్థినిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని భగల్‌కోట్‌లో వెలుగు చూసింది.
సాధారణంగా ఎవరైనా తప్పు చేస్తే దానిపై విచారణ జరిపి శిక్ష వేసే అధికారం పోలీసులు, న్యాయవ్యవస్థకు ఉంది. కానీ కొందరు మాత్రం అవేవీ పట్టించుకోకుండా రెచ్చిపోతుంటారు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగుళూరు లోనూ అలాంటి ఘటనే జరిగింది. ఓ విద్యార్థిని దొంగతనం చేసిందని ఆరోపిస్తూ ఆమెతో బలవంతంగా దుస్తులు విప్పించారు. తీవ్ర అవమానాన్ని తట్టుకోలేక బాధితురాలు రెండు రోజుల అనంతరం సూసైడ్ చేసుకుంది. స్థానికంగా ఉండే ఓ పాఠశాలలో చదువుతున్న బాలికపై అదే స్కూల్ లోని టీచర్ పర్సులో నుంచి రెండు వేల రూపాయలు దొంగతనం చేసిందని ఆరోపణలు మోపారు. తాను తీయలేదని తనకేమీ తెలియదని చెబుతున్నా వినిపించుకోకుండా సదరు ఉపాధ్యాయుడు ఆమెతో దుస్తులు విప్పించాడు.హెడ్‌మాస్టర్ కూడా బాలికను నిందించాడు. అంతటితో ఆగకుండా బాలిక ఏ తప్పూ చేయలేదని ప్రమాణం చేసేందుకు సమీపంలోని ఆలయానికీ తీసుకెళ్లడం గమనార్హం.
తనను స్కూల్ నుంచి బహిష్కరిస్తే అవమానంగా ఉంటుందని బాధితురాలు ఎనిమిదో తరగతి విద్యార్థిని వద్ద చెప్పినట్లు తెలిసింది. సంఘటన జరిగిన అనంతరం బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది. రెండు రోజులుగా ఎవరితోనూ మాట్లాడలేదు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ చేసుకుంది. అదే పాఠశాలలో చదువుతున్న బాధితురాలి సోదరి ద్వారా ఈ విషయాలు తెలుసుకున్న కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మృతికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. మృతదేహానికి స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై మాట్లాడేందుకు పాఠశాల యాజమాన్యం నిరాకరించడం గమనార్హం.