Goa: ఇటలీ రాయబారి భార్యకు గాయాలు..

రిసార్ట్ యజమానిపై కేసు

Update: 2024-02-04 05:30 GMT

త్తర గోవాలోని అశ్వెం బీచ్‌లో జనవరి 1న నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఓ వినూత్న సంఘటన చోటుచేసుకుంది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జనవరి 1న ఈ ఘటన జరిగింది.ఆ సమయంలో గోవా బీచ్ రిసార్ట్‌లో బాణాసంచా కాల్చడం వల్ల అక్కడకు వచ్చిన ఇటలీ రాయబారి భార్య తలకు గాయాలయ్యాయి.

దీంతో గోవాలోని ఇటలీ డిప్యూటీ కాన్సుల్ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు రిసార్ట్‌ యజమానిపై కేసు నమోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 338 కింద కేసు నమోదు చేయబడిందని పోలీసులు తెలిపారు. అయితే రిసార్ట్ ఆవరణలో బాణాసంచా కాల్చడానికి అనుమతి ఇచ్చిన క్రమంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. ఈ క్రమంలో తాము తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. భారతదేశం, నేపాల్‌లోని ఇటలీ రాయబారి విన్సెంజో డి లూకా భార్య పావోలా ఫెర్రీకి బాణాసంచా తాకడంతో తలకు గాయమైంది.

ఈ నేపథ్యంలో గౌరవ వైస్ కాన్సుల్ ఆఫ్ ఇటలీ శ్రీనివాస్ డెంపో ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 2న పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 338 కింద కేసు రిజిస్టర్ చేశామని పోలీసులు తెలిపారు. బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నాక తదుపరి దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. నిందితుడిని అరెస్టు చేయాల్సి ఉందని వెల్లడించారు.

Tags:    

Similar News