Driverless Goods Train:రైలు దిగుతూ హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోయిన లోకోపైలట్

100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రైలు..

Update: 2024-02-26 01:00 GMT

పట్టాలు ఉన్నాయి. తనకు అడ్డెముంది అనుకున్నట్లుగా ఓ గూడ్స్ రైలు డ్రైవర్ లేకుండానే 84 కిలోమీటర్లు ప్రయాణించింది. 53 వ్యాగన్లతో కూడిన గూడ్స్ జమ్మూకశ్మీర్ నుంచి బయలుదేరింది. పంజాబ్‌లోని ఓ గ్రామం వరకూ డ్రైవర్ లోకో పైలట్లు లేకుండానే కదలింది. దాదాపు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్లిందని వెల్లడైంది. ముకేరియా వరకూ డ్రైవర్ లేకుండా ఈ గూడ్స్ ప్రయాణం సాగింది. 

జమ్మూకశ్మీర్‌లో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. లోకోపైలట్ (రైలు డ్రైవర్) లేకుండా 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన గూడ్స్ రైలును అధికారులు పలుప్రయత్నాల అనంతరం నిలువరించగలిగారు. రైల్వే నిర్మాణపనులకు ఈ గూడ్స్ రైలు అవసరం అయిన చిప్ రాళ్ల సామాగ్రితో బయలుదేరింది. రైలును పంజాబ్‌లోని మకేరియన్ జిల్లాలో ఆపారు. అధికారుల కథనం ప్రకారం, ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో లోకోపైలట్ రైలును కథువా స్టేషన్‌లో ఆపారు. సిబ్బంది మార్పిడి కోసం రైలు స్టేషన్‌లో ఆపారు. అయితే, రైలు దిగే క్రమంలో హ్యాండ్ బ్రేక్ వేయడం మరిచారు.

ఇక రైలు ఆగిన చోట పఠాన్‌కోట్ వైపు పట్టాలు ఏటవాలుగా ఉండటంతో ముందుకు కదిలిన రైలు చూస్తుండగానే వేగం పుంజుకుంది. ఒకానొక దశలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. దీంతో, అప్రమత్తమైన అధికారులు.. ఇతర ప్యాసింజర్ రైళ్ల సిబ్బంది లోకోపైలట్‌ల సాయంతో పలు ప్రయత్నాలు చేసి రైలును ఉంచీ బస్సీ స్టేషన్ వద్ద ఆపగలిగారు. గూడ్స్ రైలును రైల్వే సిబ్బంది, పంజాబ్‌లోని రైలు ప్రయాణికులు అనేక చిట్కాలతో ఎట్టకేలకు క్షేమంగా నిలిపివేయగలిగారు. దీంతో, పెను ప్రమాదం త్రుటిలో తప్పినట్టయింది. ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. రైల్వే నిర్మాణాల కోసం ఈ గూడ్స్ రైల్లో కాంక్రీట్, ఇతర నిర్మాణ సామగ్రిని తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. ఘటనకు గల కారణాలు తెలుసుకునేందుకు రైల్వే శాఖ దర్యాప్తునకు ఆదేశించింది.  

 

Tags:    

Similar News