Greater Noida: మద్యం మత్తులో కుక్కపై అత్యాచారం
నోయిడాలో దారుణం.. కుక్కపై అత్యాచారం చేసి.. 3వ అంతస్తు నుంచి కిందకు తోసేసిన నిందితుడు;
గ్రేటర్ నోయిడాలో ఓ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. మథురకు చెందిన సోన్వీర్ అనే 28 ఏళ్ల వ్యక్తి ఈ ప్రాంతంలోని ఆల్ఫా 2 ప్రాంతంలో ఆడ కుక్కను లైంగికంగా వేధించాడు. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు అతన్ని రెడ్‌హ్యాండెడ్‌గా చూసి అరవడంతో అపరాధి ఎలాంటి అపరాధభావం లేకుండా మూడో అంతస్తులోని బాల్కనీ నుంచి జంతువును విసిరివేసినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. నిందితున్ని అరెస్టు చేశారు.
పొరుగువారి అరుపులు విన్న నిందితుడు ఆడ కుక్కను బాల్కనీ నుంచి వీధిలో పడేశాడు. దీంతో కుక్కకు గాయాలయ్యాయి. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. నిందితుడిని అరెస్టు చేశామని స్థానిక బీటా 2 పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి వినోద్ కుమార్ మిశ్రా తెలిపారు. కుక్కపై అత్యాచారం చేసిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని సమాచారం. అతను ఓ ప్రైవేట్ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అతనిపై పోలీసు చర్యలు కొనసాగుతున్నాయి. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 377 (ప్రకృతి క్రమానికి వ్యతిరేకంగా ఏదైనా పురుషుడు, స్త్రీ లేదా జంతువుతో శారీరక సంబంధం) కింద కేసు నమోదు చేయగా, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం, 1960 కింద కూడా అభియోగాలు మోపినట్లు పోలీసులు తెలిపారు.
ఈ విషయాన్ని గ్రహించిన DCW చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ X పోస్ట్‌లో ప్రతిస్పందించారు. "అలాంటి వ్యక్తులు చీప్ గా అన్ని లిమిట్స్ ను దాటతారు" అని అన్నారు. ఆమె ఈ అసహ్యకరమైన చర్యను నిందించింది. "ఈ వ్యక్తులకు తమను తాము మానవులుగా చెప్పుకోవడానికి ఏ హక్కు ఉంది" అని ఆమె ప్రశ్నించింది.
ग्रेटर नोएडा में एक आदमी ने कुत्ते के साथ दुष्कर्म किया और जब किसी ने उसे ऐसा करते देख लिया तो उसने कुत्ते को तीसरी मंज़िल से नीचे फेंक दिया।
— Swati Maliwal (@SwatiJaiHind) October 27, 2023
किस अधिकार से ख़ुद को इंसान बोलते हैं ये लोग। घटियापन की तो सारी हदें लांघ चुके हैं… pic.twitter.com/VlTtDwoB1A