భారత ఆర్థిక వ్యవస్థలో సానుకూల ధోరణులు కొనసాగుతున్నాయి. 2025 ఆగస్టు నెలలో వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు భారీగా పెరిగాయి. 2025 ఆగస్టులో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు రూ. 1.86 లక్షల కోట్లకు చేరాయి.గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే (ఆగస్టు 2024), జీఎస్టీ వసూళ్లు 6.5% పెరిగాయి.ఈ గణాంకాలు దేశీయ వ్యాపార కార్యకలాపాలు, వినియోగం పుంజుకుంటున్నాయని సూచిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని, భవిష్యత్తులో మరింత వృద్ధి సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆగస్టులో దేశీయ ఆదాయం 9.6% పెరిగి రూ. 1.37 లక్షల కోట్లకు చేరుకుంది. అయితే, దిగుమతులపై పన్ను వసూళ్లు స్వల్పంగా 1.2% తగ్గాయి. ఈ తాజా గణాంకాలు ప్రభుత్వానికి పన్నుల రూపంలో స్థిరమైన ఆదాయం వస్తుందని, ఇది దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని స్పష్టం చేస్తున్నాయి.