Gulam Nabi Azad : పది రోజుల్లో దానిపై ప్రకటన చేస్తా : గులాంనబీ ఆజాద్
Gulam Nabi Azad : తనకు మద్దతిచ్చే వారి సంఖ్య ఎన్నో రెట్లు పెరిగిందని,పార్టీలతో సంబంధం లేకుండా తనకు సపోర్టు చేస్తున్నారని అన్నారు;
Gulam Nabi Azad : కొత్త పార్టీపై ఆజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆజాద్ కొత్త పార్టీపై పది రోజుల్లో ప్రకటన చేస్తానని తెలిపారు.తాను కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత.. తనకు మద్దతిచ్చే వారి సంఖ్య ఎన్నో రెట్లు పెరిగిందని,పార్టీలతో సంబంధం లేకుండా తనకు సపోర్టు చేస్తున్నారని అన్నారు. తాను రాజీనామా చేసి కశ్మీర్‌కు వచ్చిన తర్వాత జమ్మూలో 30-35 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 400 మందిని కలుసుకున్నట్టు తెలిపారు. వారంతా తనకు మద్దతు తెలిపారని, తాను కశ్మీర్ ప్రజల కోసం తన పోరాటం కొనసాగిస్తానని అన్నారు.