వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్కతాలో దారుణం జరిగి వారం కావస్తున్నా ఇంతవరకు విచారణను వేగవంతం చేయకపోవడాన్ని భారత మాజీ క్రికెటర్, ఆప్ ఎంపీ హర్బజన్ సింగ్ ప్రశ్నించారు. నేరస్థుడికి త్వరగా శిక్ష పడితే బాధితురాలి ఆత్మకు శాంతి చేకూరుతుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాసిన లేఖలో హర్భజన్ సింగ్ పేర్కొన్నారు.
ఈ దాడి కేవలం ఒకరిపై జరిగింది కాదనీ, సమాజంలోని ప్రతి మహిళ గౌరవం, భద్రతపై జరిగిన దాడిగా భజ్జీ అభివర్ణించారు. ప్రాణాలను రక్షించే ప్రదేశంలో ఇంతటి ఘోరం జరగడం దిగ్భ్రాంతికరమని, అయోదయోగ్యం ఎంతమాత్రమూ కాదని ఎక్స్ వేదిక ద్వారా తన అభి ప్రాయాన్ని హర్భజన్ సింగ్ వెల్లడించారు. తన ట్వీట్ ను పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్, సీఎం మమతా బెనర్జీలను ట్యాగ్ చేశారు.