Hardik Patel: గుజరాత్‌లో కాంగ్రెస్‌కి ఎదురుదెబ్బ.. వర్కింగ్ ప్రెసిడెంట్ రాజీనామా..
Hardik Patel: ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.;
Hardik Patel: ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌కి ధైర్యంగా రాజీనామా చేస్తున్నా.. నా నిర్ణయాన్ని పార్టీ నేతలు, ప్రజలు అంతా స్వాగతిస్తారని భావిస్తున్నానంటూ హార్దిక్ ట్వీట్ చేశారు. గుజరాత్ భవిష్యత్ కోసం పాజిటివ్‌గా పనిచేస్తానని చెప్పుకొచ్చారు.
పాటీదార్ ఉద్యమంతో బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు హార్దిక్ పటేల్. 2015-16లో జరిగిన పటేళ్ల రిజర్వేషన్ పోరాటంతో BJPకి చెమటలు పట్టించారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరిన ఆయన.. కొంత కాలంగా గుజరాత్ కాంగ్రెస్ నేతలపైన, అధిష్టానంపైన అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో తనకు ఫ్రీహ్యాండ్ ఇవ్వడం లేదని బాహాటంగానే విమర్శలు చేశారు.
ఈ నేపథ్యంలోనే హార్దిక్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పడం ఖాయమంటూ కొన్నాళ్లుగా ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. చివరికిప్పుడు హార్దిక్ పటేల్ గుడ్‌బై చెప్పేశారు. ఆయన్ను బుజ్జగించేందుకు రాహుల్ గాంధీ చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. అటు.. హార్దిక్ పటేల్ భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తమ పార్టీలోకి రావాలంటూ ఆప్ ఆహ్వానించింది. హార్దిక్ ఏం చేస్తారు అనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది.
అటు, హార్దిక్ పటేల్ తీరును గుజరాత్ కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారు. తనకు వచ్చిన ఇబ్బందేంటో జాతీయ నాయకత్వానికి చెప్పకుండా ఏకపక్షంగా విమర్శలు చేయడం తగదని హార్దిక్‌పై ఎదురు దాడికి దిగారు. సమస్యలుంటే అంతర్గతంగా చర్చించుకోవాలని, మీడియాకి ఎక్కి అల్లరి చేయడం సరికాదని విమర్శించారు. వారం రోజలుగా ఈ మాటల యుద్ధం జరుగుతుండగా ఇప్పుడు హార్దిక్ రాజీనామాతో.. నెక్స్ట్ ఏం జరగబోతోందనేది ఉత్కంఠ రేపుతోంది.