Dharmendra Pradhan : జాతీయస్థాయి ప్రవేశపరీక్షలను విలీనం చేసే ప్రతిపాదన లేదు : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

Dharmendra Pradhan : జాతీయ స్థాయి ప్రవేశపరీక్షల విలీనంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు

Update: 2022-09-07 14:39 GMT

Dharmendra Pradhan : జాతీయ స్థాయి ప్రవేశపరీక్షల విలీనంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. విద్యార్ధులు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్,నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్,యూజీ, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశపరీక్షలను విలీనం చేసే ప్రతిపాదన ప్రస్తుతానికి ఏమి లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు.

కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది నుంచి మొదలుపెట్టిన సీయూఈటీ లోకే నీట్‌, జేఈఈ మెయిన్‌ను విలీనం చేయాలన్న ఆలోచన ఉన్నట్లు UGC ఛైర్మన్‌ ఎం.జగదీశ్‌కుమార్‌ ఇటీవల ప్రకటించారు.అయితే ఆ ఆలోచన లేదని మంత్రి క్లారిటీ ఇచ్చారు.

Tags:    

Similar News