వయోవృద్ధుల సంక్షేమానికి ప్రధాని మోదీ ఆపన్న హస్తం అందించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ‘70 ఏళ్లు దాటిన వారందరికీ రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించారు. పేద, ధనిక తేడా లేకుండా 6 కోట్ల మంది వయోవృద్ధులకు లబ్ధి చేకూరనుంది. వచ్చే రెండేళ్లలో ఈ పథకంపై రూ.3,437 కోట్లను కేంద్రం ఖర్చు చేయనుంది. 70 ఏళ్లు దాటిన వయో వృద్ధులందరికీ.. ఈ పథకం కోసం ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. తెలంగాణ నుంచి అదనంగా మరో 10 లక్షల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి జరగనుంది. ఆయుష్మాన్ పరిధిలో ఉన్న కుటుంబాల్లోని 70 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు అదనంగా ఏడాదికి రూ.5లక్షల టాప్-అప్ కవర్ ఇవ్వనుంది. కేంద్రం నిర్ణయంతో.. వయోవృద్ధుల్లో హర్షం నెలకొంది. వయోవృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు’ అని మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు.