Heart Disease: దేశంలో 30% మరణాలు గుండె జబ్బులతోనే

శాంపుల్‌ రిజిస్ట్రేషన్‌ సర్వే వెల్లడి

Update: 2025-09-06 00:30 GMT

 భారత దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు హృదయ సంబంధ వ్యాధుల కారణంగా మరణిస్తున్నారని, మొత్తం 30 మరణాల్లో 30 శాతం దీని కారణంగానే సంభవిస్తున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇందులో గుండెపోటు, స్ట్రోక్స్‌ వంటిని ఉన్నాయి. రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జరిపిన శాంపుల్‌ రిజిస్ట్రేషన్‌ సర్వే వివరాల నివేదికను ‘మరణానికి కారణాలు’ పేరుతో విడుదల చేశారు. దేశంలో 2021-23 మధ్య అసంక్రమిత వ్యాధుల కారణంగా 56.7 శాతం మంది మరణించారని ఈ నివేదిక తెలిపింది. అలాగే సాంక్రమిక, ప్రసూతి, ప్రసవానంతర, ఆహార లోపం తదితర కారణాలతో 23.4 శాతం మంది కన్నుమూశారు.

  • కరోనా వైరస్‌ ప్రభావం చూపిన 2020-2022 కాలంలో మరణాలకు.. అసాంక్రమిక వ్యాధులు 55.7శాతం కారణం కాగా, సాంక్రమిక, ప్రసవకాలిక, పౌష్టికాహార సంబంధ కారణాల వాటా 24 శాతంగా ఉంది.
  • మొత్తంగా... ప్రజల ప్రాణాలు హరిస్తోన్న వ్యాధులన్నింటిలో గుండె జబ్బుల వాటా 31శాతంగా ఉంటోంది. జీవనశైలితో ముడిపడిన ఈ వ్యాధులు 30ఏళ్ల వయసు వారికీ ముప్పుగా పరిణమించాయి.
  • శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు 9.3శాతం, క్యాన్సర్, కణుతులు తదితరాలు 6.4శాతం, శ్వాసకోశ వ్యాధులు 5.7శాతం మరణాలకు కారణమవుతున్నాయి.
  • జీర్ణవ్యవస్థ రుగ్మతలు 5.3శాతం, గుర్తించలేని కారణాలతో వచ్చే జ్వరాలు 4.9శాతం, అంతర్గత గాయాలు 3.7శాతం, మధుమేహం వల్ల 3.7శాతం, జననేంద్రియ సంబంధ వ్యాధులతో 3శాతం మరణాలు సంభవిస్తున్నాయి.
  • తీవ్రగాయాల వల్ల 9.4శాతం, గుర్తించలేని కారణాలతో చనిపోయే కేసులు 10.5శాతంగా ఉన్నట్లు ఎస్‌ఆర్‌ఎస్‌ నివేదిక వెల్లడించింది.
Tags:    

Similar News