18 నెలల చిన్నారికి రెండు సార్లు గుండెపోటు.. హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేసి..
బల్గేరియాకు చెందిన 18 నెలల పసికందుకు చెన్నై వైద్యులు గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించి ఆమెకు నూతనోత్తేజం అందించారు.;
బల్గేరియాకు చెందిన 18 నెలల పసికందుకు చెన్నై వైద్యులు గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించి ఆమెకు నూతనోత్తేజం అందించారు. రెండు కార్డియాక్ అరెస్ట్‌ల నుండి బయటపడిన 18 నెలల బల్గేరియన్ చిన్నారికి ఓపెన్-హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ శస్త్రచికిత్స చేసి కొత్త జీవితం అందించారు వైద్యులు.
టెర్మినల్ హార్ట్ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న చిన్నారిని చికిత్స నిమిత్తం బల్గేరియా నుంచి చెన్నైకి విమానంలో తరలించారు. చిన్నారికి రెండుసార్లు గుండెపోటు వచ్చింది, ఒకటి విమానంలో ఉండగా మరొకటి శస్త్రచికిత్స జరిగిన ప్రైవేట్ ఆసుపత్రిలో వచ్చింది. వైద్యుల పర్యవేక్షణలో ఉండడం వలన పాపకు ప్రాణాపాయం తప్పింది.
మొదట్లో గుండెకు ప్రత్యామ్నాయంగా ఎక్స్‌టర్నల్ ఆర్టిక్యులేటెడ్ పంప్‌గా పనిచేసే 'బెర్లిన్ హార్ట్'ని ఉపయోగించాలని వైద్యులు ప్లాన్ చేశారు. 18 నెలల శిశువు యొక్క అవయవాలు అందుబాటులో ఉన్నాయని మాకు బొంబాయి నుండి కాల్ వచ్చింది. దాంతో మేము ఉన్నపళంగా బయలుదేరాము అని పాప తల్లిదండ్రులు వివరించారు.
అయితే దాత యొక్క బ్లడ్ పాపకి సరిపోలలేదు. అయినప్పటికీ, వైద్యులు 'ABO- అననుకూల మార్పిడి'తో ముందుకు సాగారు, ఈ ప్రక్రియ బ్లడ్ గ్రూప్ తో సంబంధం లేకుండా ఆపరేషన్ చేయడానికి వీలు కల్పిస్తుందని డాక్టర్ సురేష్ రావు వివరించారు.
చిన్నారి క్రిస్సీ మరియు ఆమె తల్లి ఎవాంజెలీనా జూలై 6న బల్గేరియా నుండి చెన్నైకి చేరుకున్నారు. చిన్నారికి గుండె మార్పిడిని వైద్యులు చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. చికిత్సకు చాలా సమయం పడుతుంది. పాప చూడబోతే అనారోగ్యంతో వెంటిలేటర్ పై ఉంది. గుండె రెండు సార్లు ఆగిపోయింది.
పీడియాట్రిక్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం అవయవాన్ని కనుగొనడానికి ఏడు రోజులు మాత్రమే పట్టింది. ఇది అరుదైన కేసు అని వైద్యులు పేర్కొన్నారు. ఆపరేషన్ అనంతరం పాప ఇప్పుడు యాక్టివ్ గా ఉందని, కోలుకునే ప్రక్రియలో ఉందని ఎవాంజెలినా పేర్కొంది.