దేశ రాజధానిలో తీవ్ర వేడిగాలులు.. ఢిల్లీలో 5, నోయిడాలో 10 మంది మృతి

ఢిల్లీలోని లోక్‌నాయక్‌ ఆసుపత్రి వైద్యుడు మాట్లాడుతూ హీట్‌వేవ్‌ బారిన పడిన వారిలో ఎక్కువ మంది కార్మికులు లేదా రిక్షా పుల్లర్లేనని, వారిలో ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడిన వారేనని చెప్పారు.;

Update: 2024-06-19 05:42 GMT

దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర వేడిగాలులు వీస్తుండటంతో గత 72 గంటల్లో ఢిల్లీలో ఐదుగురు మరణించారు. మూడు ఆసుపత్రుల్లో వడదెబ్బతో బాధితులు చనిపోయారు. నోయిడాలో కూడా గత 24 గంటల్లో 10 మందికి పైగా మరణించారు.

ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ మరియు సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లో ఒక్కొక్కరు మరణించారు. వేడిగాలుల కారణంగా దాదాపు 36 మందిని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేర్చారు. జూన్ 16న హీట్ స్ట్రోక్ కారణంగా మరణించిన కారు మెకానిక్‌తో సహా లోక్ నాయక్ హాస్పిటల్ (ఎల్‌ఎన్‌జెపి)లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మెకానిక్ 106 డిగ్రీల తీవ్ర జ్వరంతో జూన్ 15 న ఆసుపత్రిలో చేరారు. రైలు వెళ్లిపోవడంతో ఏం చేయాలో తెలియక స్టేషన్‌లో  అటూ ఇటూ తిరుగుతున్న బీహార్‌కు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు హీట్ స్ట్రోక్‌ కారణంగా మృతి చెందాడు. 

106 నుండి 107 డిగ్రీలకు చేరుకునే అధిక జ్వరం లక్షణాలతో ఏడుగురు వ్యక్తులు ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో చేరారు. వారిలో ఐదుగురు వెంటిలేటర్‌పై ఉంచబడ్డారు. వీరిలో ముగ్గురు రోగులు 65 ఏళ్లు పైబడిన వారు.

ఎల్‌ఎన్‌జేపీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ హీట్ స్ట్రోక్, 105 డిగ్రీల కంటే ఎక్కువ జ్వరం, విపరీతమైన డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారు.

ఢిల్లీలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రులు మరియు చిన్న క్లినిక్‌లలో హీట్ స్ట్రోక్‌తో బాధపడుతున్న రోగుల సంఖ్య సగటున పెరుగుతోంది. పహర్‌గంజ్‌లో క్లినిక్ నడుపుతున్న డాక్టర్ గౌరవ్ కుమార్ మాట్లాడుతూ, గత నెలలో హీట్‌వేవ్‌తో బాధపడుతున్న వారి సంఖ్య రెండు రెట్లు పెరిగింది. బాధితుల్లో ఎక్కువ మంది రిక్షా కార్మికులు లేదా రోజువారీ కూలీలేనని ఆయన చెప్పారు.

అయితే, రాబోయే 24-48 గంటల్లో వాతావరణంలో మార్పుల కారణంగా నిరంతర వేడి నుండి తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు.

Tags:    

Similar News