Rains: చిగురుటాకులా హిమాచల్ ప్రదేశ్
వీధులు జలమయం కాగా.. వంతెనలు కొట్టుకుపోతున్నాయి.;
ప్రకృతి ప్రకోపానికి హిమాచల్‌ప్రదేశ్ తల్లడిల్లి పోయింది.వానలు తగ్గినా ముప్పు ఇంకా వీడలేదు.కులు-మనాలి ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది. ఈ టూరిస్ట్ హాట్‌స్పాట్‌లో రోడ్లు ఎక్కడికక్కడ కొట్టుకు పోయాయి. వీధులు జలమయం కాగా.. వంతెనలు కొట్టుకుపోతున్నాయి.చండీగఢ్-మనాలి హైవే పై కొండచరియలు విరిగిపడగా..సిమ్లా-కిన్నౌర్ రహదారిలో స్లైడ్‌లు,రాళ్లు పడిపోవడంతో బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
అతివృష్టి బాధిత ఆరు రాష్ట్రాల్లో హిమాచల్‌ప్రదేశ్‌కు ఇంకా ఊరట లభించడం లేదు. ప్రజలు, పర్యాటకులు శిబిరాల్లో చిక్కుకుపోగా సిమ్లా, సిర్మౌర్, కిన్నౌర్ జిల్లాల్లో మెరుపు వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరిస్తున్నారు. పర్యాటకుల్ని వాయుసేన హెలికాప్టర్ ద్వారా తరలించాలని ప్రయత్నించినా వాతావరణం దానికి అనుకూలించలేదు. బాగా దెబ్బతిన్న హిమాచల్‌లో రహదారుల పునరుద్ధరణకు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్,సరిహద్దు రహదారుల సంస్థ బలగాలను కూడా రంగంలో దించారు. వేర్వేరుచోట్ల 800 మంది వరదనీళ్లలో చిక్కుకున్నారు. దాదాపు 4వేల కోట్ల ఆస్తినష్టం సంభవించిందని సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు తెలిపారు.
మరోవైపు చండీగఢ్-మనాలి జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా పలు చోట్ల రహదారులు మూసుకుపోయింది. సిమ్లా-కిన్నౌర్ రహదారి కూడా స్లైడ్‌లు, రాళ్లు పడిపోవడం వల్ల వాహనాల రాకపోకలకు మూసివేశారు. ఆకస్మిక వరదలకు కొన్ని జిల్లాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. వంతెనలు ధ్వంసమయ్యాయి.భారీతో వర్షం వీధులన్నీ జలమయం అయ్యాయి. వరద ఉధృతికి వంతెనలు కొట్టుకుపోతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రజల జీవితం అగమ్యగోచరంగా మారింది.