Chennai: తమిళనాడులో కుండపోత వర్షం..

విద్యా సంస్థలకు సెలవు.. ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం;

Update: 2024-10-15 06:15 GMT

తమిళనాడు  రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు   కురుస్తున్నాయి. చెన్నై సహా తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌ పట్టు సహా పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షం పడుతోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

 తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది. మరో 24 గంటల పాటు ఇదే స్థాయిలో వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. చెన్నై నగరంలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి టీ నగర్, వెలచేరి, పురుషవాకం, అన్నా నగర్, కోయంబేడు సహా ఇతర లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో అలర్ట్ అయిన తమిళనాడు ప్రభుత్వం.. చెన్నై సిటీలోని సబ్ వేలను మూసి వేసింది. దీంతో పాటు మెట్రో ట్రైన్ సేవలు తాత్కాలికంగా రద్దు చేసింది.

ఇక, పలు చోట్లా రోడ్లపైకి మెడ లోతు వరకు వరద నీరు చేరింది. కుండపోత వర్షం ధాటికి సెల్ ఫోన్ సిగ్నల్స్ కు అంతరాయం కలిగింది. ఇక, సిగ్నల్ ఇష్యూ రాకుండా ఎయిర్‌టెల్, జియో, బీఎస్‌ఎన్‌ఎల్, వొడాఫోన్ తో పాటు ఇతర సంస్థల ప్రతినిధులతో అధికారుల అత్యవసర సమావేశం అయ్యారు. అలాగే, కమాండ్ కంట్రోల్ రూమ్ లో నుంచి భారీ వర్షాలను రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పర్యవేక్షిస్తున్నారు.

Tags:    

Similar News