North India Rains : ఉత్తర భారతాన్ని ముంచెత్తుతున్న భారీ వర్షాలు..

North India Rains : ఉత్తరాధి రాష్ట్రాలను వర్షాలు ఉతికి ఆరేసినంత పనిచేశాయి. గ్యాప్‌ లేకుండా కురిసిన వానలకు సంధు లేకుండా వరదలు వచ్చేశాయి;

Update: 2022-09-24 15:36 GMT

North India Rains : ఉత్తరాధి రాష్ట్రాలను వర్షాలు ఉతికి ఆరేసినంత పనిచేశాయి. గ్యాప్‌ లేకుండా కురిసిన వానలకు సంధు లేకుండా వరదలు వచ్చేశాయి. గల్లీలు, రోడ్లు వేటిని వదిలిపెట్టలేదు. అంతా వరదమయం.. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌.. ఈ మూడు రాష్ట్రాలు వరదలతో ముప్పతిప్పలు పడుతున్నాయి.. బండ్లు ఓడలవుతాయంటే.. అర్థం వేరే కావచ్చు కానీ.. ఇక్కడ మాత్రం బండ్లు నిజంగానే పడవలైపోయాయి. రోడ్లపైకిసడన్‌గా వరదలు రావడంతో వాహనాలు కొట్టుకపోయాయి. పాపం బయటకి వచ్చిన వారు ఇంటికి వెళ్లడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది.

యూపీలోని గురుగ్రామ్‌లో రోడ్లు నీళ్లతో నిండిపోయాయి. వాహనాలు ఎక్కిడకక్కడ నిలిచిపోయాయి. దీంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇచ్చారు. భారీ వర్షాలకు ఉరుములు, గోడలు కూలడం, ఇళ్లు ధ్వంసం అవడం లాంటి ఘటనలతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు.

ఢిల్లీని వరదలు ముంచెత్తాయి. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఎక్స్ ప్రెస్ వేలో వరద నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ముందుకు వెళ్లలేక.. వెనక్కి వెళ్లలేక చుక్కలు చూశారు.

మరోవైపు హర్యానాలో కూడా భారీగా వానలు పడుతున్నాయి. భారీ వర్షాలకు ప్రజలు వణికిపోతున్నారు. గుర్గావ్‌లో కురిసిన కుండపోత వానకు పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై వరద నీటి ప్రవాహం నదులను తలపిస్తోంది. స్కూళ్లు, కాలేజీలు మూత పడ్డాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని దుకాణాల్లోకి కూడా నీరు ప్రవేశించింది. చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపై ఉన్నకారుల్లోకి కూడా వరద నీళ్లు వచ్చేశాయి. వాటిని తీసుకెళ్లడానికి వాహనదారుల అవస్థలు అన్నీ ఇన్నీకాదు.

ఇప్పటికే భీకర వానలతో అల్లాడిపోతున్న ఉత్తరాధి రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరో పిడుగు లాంటి వార్తను చెప్పింది. వాన ఎపిసోడ్ ఇంకా మిగిలే ఉందని వార్నింగ్ఇచ్చింది. మరో రెండ్రోజులు భారీగా వర్షాలు తప్పవని వాతావరణ హెచ్చరించింది.

Tags:    

Similar News