Vande Bharat Express : త్వరలో హైస్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లు.. గంటకు 180 కిలోమీటర్లు..
Vande Bharat Express : దేశంలో రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శాఖ శుభవార్త అందించింది
Vande Bharat Express : దేశంలో రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శాఖ శుభవార్త అందించింది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలతో వందేభారత్ హైస్పీడ్ రైళ్లను త్వరలో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో నడిచే ఈ రైళ్లలో ప్రయాణికులకు అత్యుత్తమమైన అప్ గ్రేడ్ సౌకర్యాలు అందించనుంది. ఈ రైలులో ప్రయాణికులకు వైఫై సౌకర్యం కూడా కల్పించనున్నారు.
15 శాతం ఎక్కువ ఎనర్జీ ఎఫెక్టివ్ ఏసీలు, డస్ట్-ఫ్రీ క్లీన్ ఎయిర్ కూలింగ్ ట్రాక్షన్ మోటారు వల్ల ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణానికి వీలవుతోంది. వందే భారత్ రైళ్లలో 32-అంగుళాల ఎల్సీడీ టీవీలు కూడా ఉంటాయి. 2023 నాటికి 75 వందేభారత్ రైళ్లను తయారు చేయాలని భారతీయ రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.