RAIN ALERT: బయటకు రావద్దు... ఇంట్లోనే ఉండండి

భారీ వర్షాల వేళ ప్రజలకు హిమాచల్‌ సీఎం విజ్ఞప్తి.... ఇంట్లోనే ఉండాలని సూచన... 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని వినతి..।

Update: 2023-07-10 08:00 GMT

ఉత్తరాది రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్న వేళ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ రాబోయే 24 గంటలు సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని ఎవరూ బయటకు రావద్దని సీఎం సుఖ్వీందర్ సింగ్ కోరారు. ఈ మేరకు ప్రజలకు పలు సూచనలు ఇస్తూ ఒక వీడియోను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఉంచారు. 24 గంటలు తాను ప్రజలకు అందుబాటులోఉంటానని ఎమ్మెల్యేలు కూడా తమతమ నియోజకవర్గాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటి వరకు వరదల కారణంగా 14 మంది మృతి చెందారని అందువల్ల ప్రజలందరూ సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని సుఖ్వీందర్ కోరారు. సహాయక చర్యలు అందించేందుకు హెల్ప్ లైన్ నంబర్లును ప్రకటించారు. నేడు, రేపు.....హిమాచల్ లో అన్నీ పాఠశాలలు,కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు సుఖ్వీందర్ పేర్కొన్నారు.

Tags:    

Similar News