హిమాచల్‌ప్రదేశ్‌లో మంచు తుఫాన్ బీభత్సం సృష్టించింది. మనాలిలో రోడ్లు, ఇళ్లులు మంచుతో కప్పేశాయి. ప్రధాన రహదారిపై 8-10 కి.మీ మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పర్యాటకులు మంచులో చిక్కుకుని నరకం అనుభవిస్తున్నారు. కార్లలో రోడ్లపైనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హిమాచల్ ప్రదేశ్‌లోని కులు, మనాలితో సహా అనేక ప్రాంతాల్లో భారీ హిమపాతం కురుస్తోంది. పర్వతాలు, చెట్లు మంచుతో కప్పబడ్డాయి. దీంతో అందమైన దృశ్యం ఆవిష్కృతమైంది. అయితే పర్యాటకులు మాత్రం పర్యాటక ప్రాంతాన్ని చేరలేక ఇబ్బంది పడుతున్నారు. చాలామంది 24 గంటలకు పైగా ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు. ఢిల్లీ, గురుగ్రామ్, చండీగఢ్ వంటి నగరాల నుంచి ప్రజలు పర్వతాలకు తరలి వస్తున్నారు. వందలాది మంది పర్యాటకులు చలిలో చిక్కుకున్నారు. మనాలికి వెళ్లే జాతీయ రహదారి దాదాపు 8 నుంచి 10 కిలోమీటర్ల వరకు మూసివేయబడింది. దీంతో పర్యాటకులు తమ వాహనాలను వదిలి మంచులో చాలా దూరం నడవాల్సి వస్తుంది. అధికారులు ప్రస్తుతం రోడ్లను క్లియర్ చేసే పనిలో ఉన్నారు. పరిస్థితి మెరుగుపడే వరకు ప్రజలు అనవసరంగా ప్రయాణించవద్దని సూచించారు.