'మీ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి': తమిళనాడు ప్రభుత్వంపై పవన్ విమర్శలు..

తమిళనాడు హిందీ వ్యతిరేక వైఖరిని పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శించారు. మరి అలాగైతే మీరు మీ 'తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేస్తున్నారు.. ఇక నుంచి ఆ పని చేయకండి' అని అన్నారు.;

Update: 2025-03-15 05:10 GMT

తమిళనాడు హిందీ వ్యతిరేక వైఖరిని పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శించారు. మరి అలాగైతే మీరు మీ 'తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేస్తున్నారు.. ఇక నుంచి ఆ పని చేయకండి' అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తమిళనాడుపై హిందీని రుద్దుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం తమిళనాడుపై విమర్శలు గుప్పించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తమిళనాడు వైఖరిని తప్పుబట్టారు. 

"మేము మాట్లాడేటప్పుడు సంస్కృతాన్ని అవమానించారని ఆరోపిస్తారు. దక్షిణాదిపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారని చెబుతున్నారు. కానీ అన్ని భారతీయ భాషలు మన సంస్కృతిలో భాగం కాదా?" అని ఆయన ప్రశ్నించారు.

"తమిళనాడు వారు హిందీని కోరుకోవడం లేదని అంటున్నారు. నా మనసులో ఒక ఆలోచన వచ్చింది - అలా అయితే, వారి తమిళ చిత్రాలను హిందీలో ఎందుకు డబ్ చేస్తు న్నారు? ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు ఛత్తీస్‌గఢ్ వంటి హిందీ మాట్లాడే రాష్ట్రాల నుండి డబ్బులు రావాలని కోరుకుంటున్నారు. పనులు చేయించుకోవడం కోసం బీహార్ కార్మికులపై ఆధారపడుతున్నారు. అయినప్పటికీ, హిందీని తృణీకరిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇది ఏవిధంగా న్యాయమైనది?" అని ఆయన అన్నారు.

తన సొంత అనుభవాలను వివరిస్తూ.. చెన్నైలో చదువుతున్నప్పుడు తాను వివక్షను ఎదుర్కొన్నానని కళ్యాణ్ పంచుకున్నారు. "ఎవరైనా కోపంగా ఉన్నప్పుడల్లా భారతదేశం విభజించబడటానికి ఒక చిన్న ముక్కా ఇది? ఎవరైనా సరే భారతదేశ సమగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే, దానిని రక్షించడానికి నాలాంటి కోట్లాది మంది లేస్తారు" అని ఆయన అన్నారు. 

Tags:    

Similar News