Karnataka : వరదలతో హోటల్ రూంలకు పెరిగిన డిమాండ్.. రెండింతలు పెరిగిన చార్జీలు..
Karanataka : కర్నాటకలో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది.. ముఖ్యంగా బెంగళూరులో పరిస్థితి ఇంకా దారుణంగానే ఉంది;
Karnataka : కర్నాటకలో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది.. ముఖ్యంగా బెంగళూరులో పరిస్థితి ఇంకా దారుణంగానే ఉంది.. నగరాన్ని వరదలు ముంచెత్తడంతో చాలా ప్రాంతాల్లో నిలువ నీడ లేకుండా పోయింది.. దీంతో జనం హోటళ్లకు పరుగులు తీస్తున్నారు.. అయితే, హోటళ్లలో టారిఫ్‌లు అమాంతం పెరిగిపోయాయి.. ఐటీ హబ్‌లో వరదలు, నీటి ఎద్దడి కారణంగా అనే కుటుంబాలు హోటళ్లకు మకాం మార్చడంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది.
మామూలు రోజుల్లో 10 నుంచి 20 వేల వరకు ఉన్న హోటల్ రూమ్ ధరలు రెండింతలు పెరిగిపోయాయి.. ప్రధానంగా వైట్ ఫీల్డ్, అవుటర్ రింగ్ రోడ్, ఓల్డ్ ఎయిర్‌పోర్ట్, కోరమంగళ సహా పలు ప్రాంతాల్లోని హోటళ్లలో రూమ్‌లు ఫుల్ అయిపోయాయి..