Sachin : డ్రగ్స్ అలవాటు పడి ఎంత పని చేశాడంటే?

Update: 2025-09-27 11:49 GMT

ఉత్తర్ ప్రదేశ్ హపూర్ లో D-అడిక్షన్ సెంటర్ లో చేర్చారన్న కోపంతో 40 ఏళ్ల సచిన్ అనే వ్యక్తి..... 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రష్ లను మింగాడు. మత్తు పదార్థాలకు బానిసగా మారిన సచిన్ ను ఇటీవల అతని కుటుంబ సభ్యులు డీ-అడిక్షన్ సెంటర్ లో చేర్చారు. తనను రిహాబిలిటేషన్ సెంటర్ లో చేర్చడంపై అసంతృప్తిగా ఉన్న సచిన్ ఆ కోపంతో అక్కడ బల్లపై ఉన్న స్పూన్లను..., టూత్ బ్రష్ లను బాత్రూమ్ లోకి తీసుకెళ్లి వాటిని విరిచి మింగాడు. అనంతరం తీవ్రమైన కడుపునొప్పి రావడంతో... అతడిని ఆస్పత్రి తరలించి.... అల్ట్రాసౌండ్ , ఎక్స్ రే పరీక్షలు చేశారు. ఆ ఫలితాలు వైద్యులను షాక్ కు గురిచేశాయి. ఒకటి రెండు కాదు.. మొత్తం 29 స్పూన్లు, 19 టూత్ బ్రష్ లు అతని కడుపులో ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స చేసిన వైద్యులు.... సచిన్ కడుపులో నుంచి వాటిని బయటకి తీశారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్టు... వైద్యులు తెలిపారు.

Tags:    

Similar News