Huge Fire Accident: మహారాష్ట్రలోని అంబర్‌నాథ్‌లోని ఫార్మా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..
రసాయనాల డ్రమ్ములు పేలడంతో..;
మహారాష్ట్రలోని అంబర్‌నాథ్‌లోని ఫార్మా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అంబర్‌నాథ్, కళ్యాణ్, ఉల్హాస్‌నగర్, బద్లాపూర్‌ల నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేయడం ప్రారంభించారు. మంటలు చాలా తీవ్రంగా ఉండడంతో పెద్దెత్తున భారీగా పొగ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఈ ఘటన థానే జిల్లాలోని అంబర్‌నాథ్ లోని ఆనంద్ నగర్ ఎంఐడీసీ ప్రాంతంలో చోటుచేసుకుంది. రసినో ఫార్మా అనే కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఈ ఫ్యాక్టరీలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఈ సమయంలో కంపెనీ నుంచి పేలుడు శబ్దాలు కూడా వినిపించాయి. ఈ ఘటనలో భారీ ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని ప్రాథమిక సమాచారం. అయితే అగ్నిప్రమాదానికి కారణమేమిటనేది ఇంకా తెలియరాలేదు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అగ్నిప్రమాదం తరువాత, కెమికల్ ఫ్యాక్టరీలో ఉంచిన రసాయనాల డ్రమ్ములు పేలాయి. దీంతో మంటలు భారీగా లేచాయి. అగ్నిప్రమాదం కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. ప్రస్తుతం అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.