Maharashtra: బట్టల గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం
మహారాష్ట్రలోని థానేలో మంగళవారం తెల్లవారుజామున బట్టల గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
మహారాష్ట్రలోని థానేలో మంగళవారం తెల్లవారుజామున బట్టల గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రాంతం నుండి వచ్చిన విజువల్స్‌లో, పెద్ద ఫ్యాక్టరీ భవనం నుండి భారీ మంటలు ఎగసిపడుతున్నట్లు చూడవచ్చు.
ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటన వెనుక కారణం ఇంకా తెలియాల్సి ఉంది. సంఘటన వివరాలను పంచుకుంటూ, భివాండి అగ్నిమాపక దళ అధికారి, ప్రమోద్ కకడే మాట్లాడుతూ, "సరావలి గ్రామంలో ఉన్న ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి... ఈ సంఘటన తెల్లవారుజామున 3:00 గంటలకు జరిగింది. మంటలను ఆర్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకసారి మంటలు పూర్తిగా ఆరిపోయిన తరువాత అప్పుడు మేము నష్టాన్ని లెక్కించగలుగుతాము అని చెప్పారు.