నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఫ్లాట్‌లో పేలిన ఏసీ..
నోయిడా అగ్నిప్రమాదం: లోటస్ బౌలేవార్డ్ సొసైటీ ఫ్లాట్‌లో ఏసీ పేలుడు కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించి గందరగోళం సృష్టించింది.;
నోయిడాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. లోటస్ బౌలేవార్డ్ సొసైటీ ఫ్లాట్‌లో ఏసీ పేలుడు కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించి గందరగోళం సృష్టించింది.
సెక్టార్ 100లో ఉన్న లోటస్ బౌలేవార్డ్ సొసైటీలోని ఓ ఫ్లాట్‌లో ఏసీ పేలుడు కారణంగా మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంతో అపార్ట్ మెంట్ సొసైటీలో గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం విశేషం.