Rajasthan: బాలిక వాటర్‌ బాటిల్లో మూత్రం... బ్యాగ్‌లో ప్రేమలేఖ

రాజస్థాన్‌లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల దుశ్చర్య... ఎగిసిపడిన ఆందోళనలు... పోలీసుల లాఠీఛార్జీ...;

Update: 2023-08-01 01:30 GMT

రాజస్థాన్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాల( government senior higher secondary school)లో ఓ విద్యార్థిని తాగే వాటర్ బాటిల్‌లో అదే పాఠశాల విద్యార్థులు( Schoolboys) మూత్రం(Urine) కలపడం(Schoolboys Fill Girl's Bottle With Urine) ఉద్రిక్తత పరిస్థితుల‍(Huge Protest In Rajasthan)కు దారి తీసింది. భిల్వాఢా జిల్లాలోని లుహ రియాలోని ఓ ప్రభుత్వ స్కూల్లో విద్యార్ధిని తాగే వాటర్ బాటిల్లో ఓ వర్గం విద్యార్థులు మూత్రం కలిపారు. బాలిక ఆ నీటిని తాగగా దుర్వాసన రావడంతో దాంట్లో మూత్రం కలిపారని ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసింది. పాఠశాల యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు ఆందోళనలు చేశారు.


పాఠశాలకు తాళం వేసి మూత్రం కలిపిన అబ్బాయిల చొచ్చుకువెళ్లేందుకు గ్రామస్థులు ప్రయత్నించారు. కొంతమంది వ్యక్తులు కర్రలతో ఆ బాలల ఇళ్లకు వెళ్తుండగా( villagers tried to enter the house of the boy) పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, స్థానికుల మధ్య తోపులాట జరిగింది. కొందరు గ్రామస్థులు పోలీసులపై రాళ్ల దాడి చేయగా పోలీసులు లాఠీఛార్జి( lathi-charged) చేసి ఆందోళనకారులను తరిమికొట్టారు. అబ్బాయిలు ఆ బాలిక బ్యాగ్‌లో ప్రేమలేఖ( love letter)ను కూడా ఉంచినట్లు పోలీసులు తెలిపారు.


ప్రభుత్వ సీనియర్‌ సెకండరీ పాఠశాలలో చదువుతున్న బాలిక శుక్రవారం తన తరగతి గదిలో బ్యాగ్‌, బాటిల్‌ను వదిలి భోజనం చేసేందుకు ఇంటికి వెళ్లిందని, ఆమె తిరిగి వచ్చి బాటిల్లో( Girl's Bottle) నీళ్లు తాగినప్పుడు, దుర్వాసన( foul smell ) వచ్చిందని అదనపు ఎస్పీ ఘనశ్యామ్ వర్మ తెలిపారు. కొంతమంది అబ్బాయిలు నీటిలో మూత్రాన్ని( mixed urine with water) కలిపినట్లు గుర్తించి ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినట్లు వివరించారు.


బాలిక ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గ్రామస్తులు ఆందోళన(angry villagers )కు దిగారని పోలీసులు తెలిపారు. పాఠశాల యాజమాన్యం, తహసీల్దార్‌, లుహరియా పోలీస్‌స్టేషన్‌లోనూ గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. అయినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆందోళన ఉద్ధృతమైంది. బాలిక ఇంకా అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేయనందున ఈ కేసులో ఎటువంటి కేసు నమోదు కాలేదని, నిరసనలో భాగమైన వారిపై చర్యలు తీసుకుంటామని ఒక అధికారి తెలిపారు.

Tags:    

Similar News