Asif Quureshi : ప్రాణం తీసిన పార్కింగ్ పంచాయితీ..సినిమా కంటే ఘొరమే ఇది

న‌టి హుమా ఖురేషి సోద‌రుడి హ‌త్య కేసులో ఇద్ద‌రి అరెస్టు;

Update: 2025-08-09 01:00 GMT

 తమిళంలో ‘పార్కింగ్’ అనే సినిమా తరహాలోనే నిజ జీవితంలోనూ ఓ ఘటన జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘటనలో ప్రముఖ బాలీవుడ్ నటి హుమా ఖురేషీ సోదరుడు మృతి చెందాడు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలీవుడ్ ప్రముఖ నటి హ్యూమా ఖురేషీకి సోదరుడు ఆసిఫ్ ఖురేషీ. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని జంగ్‌పురాలో భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఎదురింట్లో గౌతమ్, ఉజ్వల్ అనే ఇద్దరు యువకులు నివాసం ఉంటున్నారు. ఐతే బైక్ పార్కింగ్ విషయంలో ఆసిఫ్ ఖురేషీ, గౌతమ్‌కు గొడవలు ఉన్నాయి.

పార్కింగ్ స్థలం విషయంలో ఎప్పటి నుంచో వివాదం నెలకొంది. గురువారం రాత్రి కూడా పార్కింగ్ విషయంలో గొడవ జరిగింది. ఐతే ఇది చిలికి చిలికి గాలివానలా మారింది. గౌతమ్, అతని సోదరుడు ఉజ్వల్ కలిసి ఆసిఫ్ ఖురేషీపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆసిఫ్ ఖురేషీ.. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అటు దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కుటుంబ సభ్యులు ఆసిఫ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. మరోవైపు దాడి అనంతరం నిందితులు పారిపోయారు. కానీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags:    

Similar News