Uttar Pradesh: రాత్రిపూట నా భార్య నాగినిగా మారి కాటేస్తోంది-భర్త ఫిర్యాదు
జిల్లా మెజిస్ట్రేట్‌కు భర్త ఫిర్యాదు
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని సీతాపూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన భార్యపై వింత ఫిర్యాదు చేశాడు. రాత్రి పూట తన భార్య పాములా మారి కాటేస్తోందన్నారు. సమాధాన్ దివస్‌లో భాగంగా జరిగే ప్రజావాణి కార్యక్రమంలో ఆ ఫిర్యాదు వివరాలు బయటకు వచ్చాయి. జిల్లా మెజిస్ట్రేట్ ముందు లోద్సా గ్రామానికి చంఎదిన మీరజ్ అనే వ్యక్తి తన ఫిర్యాదులో భార్య నాగినిగా మారి వేధిస్తున్నదన్నాడు. సార్.. నా భార్య నసీమున్ రాత్రిపూట సర్పంలా మారిపోయి తనను కాటేస్తున్నదని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
అనేక సార్లు తన భార్య తనను చంపేందుకు ప్రయత్నించిందన్నారు. కానీ ప్రతి సారి ఆ దాడి నుంచి తప్పించుకునేందుకు నిద్రలేస్తున్నట్లు చెప్పాడు. భార్య మానసికంగా వేధిస్తున్నదని, నిద్రిస్తున్న సమయంలో ఏదో ఒక రాత్రి తనను చంపేస్తుందని తన ఫిర్యాదులో తెలిపాడు. జిల్లా మెజిస్ట్రేట్ ఆ ఫిర్యాదుపై స్పందిస్తూ విచారణకు ఆదేశించారు. దీనిపై దృష్టి పెట్టాలని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్‌కు ఆదేశాలు ఇచ్చారు.
శనివారం జిల్లా మేజిస్ట్రేట్ అభిషేక్ ముందు హాజరైన మెరాజ్, తన భార్య మానసిక అనారోగ్యానికి గురైందని, రాత్రిపూట పాములా నటించి తనను భయపెడుతుందని, నిద్రపోకుండా చేస్తుందని ఫిర్యాదు చేశాడు. “ఆమె తల్లిదండ్రులకు ఇవన్నీ తెలిసని ఆరోపించాడు. అయినప్పటికీ వారు బలవంతంగా వివాహం చేసి నా జీవితాన్ని నాశనం చేశారు” అని అన్నాడు. ఫిర్యాదుదారుడి దరఖాస్తు ఆధారంగా, అధికారులు ఈ విషయాన్ని పరిష్కరించాలని కొత్వాలి పోలీసులను ఆదేశించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.