మహామండలేశ్వర్ పదవి నుంచి నటి మమతా కులకర్ణి వైదొలగారు. ఇకపై సాధ్విగానే కొనసాగుతానని తెలిపారు. కీన్నర్ అఖాడాలో కులకర్ణి ఎంట్రీ తర్వాత అందులోని సభ్యుల మధ్య వివాదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆమెకు అత్యున్నత పదవి ఇవ్వడాన్ని కొందరు వ్యతిరేకించారు. మహా కుంభమేళా పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమం అని, కొందరు వ్యక్తులు ఇందులో అసభ్యతను ప్రోత్సహిస్తున్నారని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ మండిపడ్డారు. ఇప్పటిదాకా ప్రాపంచిక సుఖాలు అనుభవించిన వ్యక్తులు ఒక్కసారిగా కాషాయ వస్త్రాలు ధరించగానే, మహామండలేశ్వర్ బిరుదులు పొందడాన్ని ఆయన ఆక్షేపించారు. ఈ క్రమంలో అఖాడా వ్యవస్థాపకులు అజయ్ దాస్, కులకర్ణి గురువు లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి మధ్య విభేదాలు తలె త్తాయి. ఈ విభేదాల మధ్య మమతా కులకర్ణిపై వేటుపడింది. దీంతో మహామండలేశ్వర్ స్థానం నుంచి వైదొలగుతున్నట్లు ఆమె ప్రకటించారు.