అర్ధరాత్రి హోటల్ సిబ్బందిపై దాడి
IAS, IPSl లను సస్పెండ్ చేసిన ప్రభుత్వం;
హోటల్ సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో ఓ ఐఏఎస్, ఓ ఐపీఎస్ సహా ఐదుగురు అధికారులను సస్పెండ్ చేసింది రాజస్థాన్ ప్రభుత్వం.రాజస్థాన్‌లో జైపూర్-అజ్మీర్ జాతీయ రహదారిపై జరిగిన ఘర్షణల్లో ఐఏఎస్ అధికారి, అజ్మీర్ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ గిరిధర్, ఐపీఎస్ అధికారి సుశీల్ కుమార్ బిష్ణోయ్ సస్పెండ్ అయినట్లు సమాచారం.సంఘటన వివరాల్లోకి వెళితే అధికారులు, కానిస్టేబుల్, మరో ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఒక పార్టీ నుంచి తిరిగి వస్తూ రెస్టారెంట్‌లో వాష్‌రూమ్ వాడుకోవడానికి వెళ్లారు. అయితే మూసి ఉన్న రెస్టారెంట్ ను తెరవమని కోరగా రెస్టారెంట్ సిబ్బంది డl కుదరదు అనడంతో మొదలైన వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది.ఈ క్రమంలో ఓ అధికారి రెస్టారెంట్ సిబ్బందిపై చేయిచేసుకున్నట్లు తెలుస్తోంది.
అనంతరం రెస్టారెంట్ సిబ్బంది కూడా అధికారిపై తిరగబడిన తర్వాత ఘర్షణ మొదలైనట్లు సమాచారం. దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా రెస్టారెంట్ సీసీటీవీలో రికార్డు అయ్యాయి.ఐపీఎస్ అధికారితో సహా పలువురు పోలీసులు తమ సిబ్బందిపై ఘర్షణకు దిగారని రెస్టారెంట్ యజమాని స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రభుత్వం ఇద్దరు ఐఏఎస్, ఐపీస్ అధికారులను సస్పెండ్ చేసింది. వీరితో పాటు మరి కొంతమంది సిబ్బంది పైనా సస్పెన్షన్ వేటు పడింది. ఈ వ్యవహారాన్ని విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ దర్యాప్తు చేస్తోందని రాజస్థాన్ పోలీసు చీఫ్ ఉమేష్ మిశ్రా తెలిపారు. అయితే తనపై వచ్చిన ఆరోపణనలను ఐపీఎస్ అధికారి బిష్ణోయ్ ఖండించారు.