Gyanvapi: మసీదే అయితే త్రిశూలం ఎందుకు ఉంది

జ్ఞానవాపీపై ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ సంచలన వ్యాఖ్యలు.. ముస్లింలు చారిత్రక తప్పిదాన్ని అంగీకరించాలని సూచన.. మండిపడ్డ మజ్లిస్‌..

Update: 2023-08-01 04:15 GMT

ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఉన్న వివాదాస్పద జ్ఞానవాపి (Gyanvapi) మసీదు (Mosque)పై యూపీ(UP) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సంచనల వ్యాఖ్యలు చేశారు. జ్ఞానవాపి(Gyanvapi )ని మసీదు అని పిలవలేమని, అలా పిలిస్తే అది వివాదాస్పదం అవుతుందని("If we call it a mosque, there will be a dispute) అన్నారు. దీనిపై ముస్లిం సమాజం ముందుకు వచ్చి ‘చారిత్రక తప్పిదానికి’ పరిష్కారం చూపాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


 ఎవరికి భగవంతుని దర్శనభాగ్యం లభించిందో.. ఆ వ్యక్తిని చూడాలని తాను భావిస్తున్నానని యోగీ వ్యాఖ్యానించారు. "మసీదులో త్రిశూలం ఉంది. జ్యోతిర్లింగం ఉంది. దేవుడి విగ్రహాలు ఉన్నాయి. వాటిని మేం పెట్టలేదు కదా? నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారమైతే.. ఈ పొరపాటును అంగీకరిస్తూ ముస్లిం వర్గాల నుంచే ప్రతిపాదన రావాల్సింది. చారిత్రక తప్పిదం చేశామని, తప్పును సరిదిద్దుకుంటామని వారే ముందుకు వచ్చి ఉండాల్సింది" అని యోగీ అన్నారు. ఇది కచ్చితంగా ‘చారిత్రక తప్పిదమే అన్నారు. ముస్లిం సమాజం ఈ తప్పును అంగీకరించాలని, ఈ వివాదానికి పరిష్కారం ముస్లిం సమాజం నుంచే రావాలని అనుకుంటున్నానని తాను అన్నారు. చారిత్రక తప్పిదానికి పరిష్కారం చూపేందుకు వారు ఓ ప్రతిపాదనతో రావాలని తాను భావిస్తున్నానని యోగి వ్యాఖ్యానించారు.

జ్ఞానవాపిలో ఉన్నది మసీదు కాదని, ఆ నిర్మాణ శైలిని గమనిస్తే ఈ విషయం అర్థమవుతుందని స్పష్టం చేశారు. ముస్లిం వర్గాలు చారిత్రక తప్పిదానికి పాల్పడ్డాయని యోగీ.. సరిదిద్దుకునే అవకాశం ఇప్పటికీ వారికి ఉందన్నారు. దీనిపై ప్రజలు ఆలోచించాలన్నారు.


జ్ఞానవాపిపై సీఎం యోగి వ్యాఖ్యలను మజ్లిస్‌ పార్టీ తీవ్రంగా పరిగణించింది. 90వ దశకంలోకి మేం వెళ్లాలనుకోవట్లేదని, చట్టం ప్రకారం తమ హక్కుల ప్రకారమే మేం అక్కడ ప్రార్థనలు చేయాలనుకుంటున్నామని MIM నేత వారిస్‌ పథా అన్నారు. కేసు కోర్టులో ఉండగా.. అలాంటి ప్రకటనలు ఎలా చేస్తారని యోగీని ప్రశ్నించారు. అలహాబాద్ హైకోర్టులో ఏఎస్ఐ సర్వేను ముస్లిం వైపు వ్యతిరేకించారని, మరికొద్ది రోజుల్లో తీర్పు వెలువడుతుందని సీఎం యోగికి తెలుసని, అయినప్పటికీ అతను అలాంటి వివాదాస్పద ప్రకటన ఇచ్చాడని, ఇది న్యాయపరిధిని ఉల్లంఘించడమే అని మజ్లిస్‌ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు.

వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టు( Allahabad High Court) ఆగస్టు 3న తీర్పు వెలువరించనుంది. అప్పటి వరకు భారత పురావస్తు శాఖ(Archaeological Survey of India ) తనిఖీపై స్టే విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రీతింకర్ దివాకర్ సర్వేపై మధ్యంతర స్టేను ఆగస్టు 3 వరకు కొనసాగుతుందని తెలిపారు. 

Tags:    

Similar News