Delhi : నాడు గెంటేస్తే.. నేడు స్పీకర్.. ఢిల్లీలో ఓడలు బండ్లు

Update: 2025-02-21 09:30 GMT

విజేందర్ గుప్తా. ఢిల్లీలో బీజేపీ ఎమ్మెల్యే. పదేళ్ల క్రితం ఆయన్ను మార్షల్స్ అసెంబ్లీ నుంచి ఎత్తు కెళ్లి బయటపడేశారు. 2015 నవంబర్ 30న ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవలి ఎన్నికల్లో ఆయన రోహిణి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కొత్తగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వంలో, ఆయన అసెంబ్లీ స్పీకర్గా నామినేట్ అయ్యారు. డిప్యూటీ స్పీకర్ మోహన్ సింగ్ బిస్త్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా విజేందర్ మీడియాతో మాట్లాడుతూ, తన కు స్పీకర్ బాధ్యతను అప్పగించినందుకు హైకమాండ్ కు థ్యాంక్స్ చెప్పారు. తన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని చెప్పారు. సభలో అర్థవంతమైన, ఆరోగ్యకరమైన చర్చలు జరిగేలా చూస్తానన్నారు. గత ఆప్ ప్రభుత్వానికి చెందిన 14 కాగ్ రిపోర్టులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని సభ ముందు ఉంచుతానని తెలిపారు.

Tags:    

Similar News