MODI: ఫ్రాన్స్ అధ్యక్షుడితో మోదీ చర్చలు...కీలక ప్రకటన
రక్షణ ఉత్పత్తుల రంగంలో పరస్పర సహకారానికి ఒప్పందం... మూడు స్కార్పీన్ సబ్‌మెరైన్ ప్రాజెక్టులపై అవగాహన.. నేవీ రఫేల్ జెట్లపై డస్సాల్ట్ ఏవియేషన్ కీలక ప్రకటన..;
ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ(PM MODI), ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్(French president Emmanuel Macron)తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ ఉత్పత్తుల రంగంలో తమ సహకారాన్ని(defence cooperation ) మరింతగా విస్తరించుకోవాలని భారత్-ఫ్రాన్స్ నిర్ణయించాయి. యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల ఇంజిన్లను సంయుక్తంగా అభివృద్ధి చేయడంతో పాటు భారత నౌకా దళం(Indian Navy) కోసం మూడు స్కార్పీన్ జలాంతర్గాములను నిర్మించే ప్రాజెక్టులపై అవగాహనకు వచ్చాయి. ప్రధాని మోదీ, మెక్రాన్ ద్వైపాక్షిక చర్చల అనంతరం అధ్యక్ష భవనం వద్ద నేతలిద్దరూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. రక్షణ, శాస్త్ర సాంకేతికత, ఇంధనం, వాణిజ్యం, అంతరిక్షం, పర్వావరణం వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై ఇదు దేశాల నాయకులు విస్తృతమైన చర్చలు జరిపారు. ఘనమైన లక్ష్యాలతో భారత్-ఫ్రాన్స్ మధ్య రాబోయే 25 ఏళ్లకు సంబంధించిన వ్యూహాత్మక బంధానికి మార్గసూచీని సిద్ధం చేస్తున్నట్లు చర్చల తర్వాత మోదీ ప్రకటించారు.
ఎల్‌ఎన్‌జీ దిగుమతికి భారత్‌కు చెందిన ఇండియన్ అయిల్, ఫ్రాన్స్‌కు చెందిన టోటల్ మధ్య దీర్ఘకాల ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. ఇది క్లీన్ ఎనర్జీ దిశగా వెళ్లేందుకు దోహదం చేస్తుందన్నారు. రక్షణ, అంతరిక్ష రంగాల్లో సహకారంపైనా మంతనాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. హెలికాప్టర్ ఇంజిన్లు, విడిభాగాల తయారీ, నిర్వహణ, మరమ్మతుల సదుపాయాలను ఫ్రెంచ్ కంపెనీలు భారత్‌లోనే ఏర్పాటు చేసేలా చర్చలు సాగుతున్నాయని మోదీ తెలిపారు.
నౌకా దళానికి అవసరమైన 26 రఫేల్ యుద్ధ విమానాలు(Rafale fighters for Navy భారత్ కొనుగోలు చేయనుందనే విషయమై ఫ్రెంచ్ ఏరోస్పేస్ కంపెనీ డస్సాల్ట్ ఏవియేషన్(Dassault Aviation) కీలక ప్రకటన చేసింది. భారత నావికాదళం కోసం 26 రాఫెల్ యుద్ధ విమానాలు(26 Rafale fighters) అందించనున్నట్లు ప్రకటించింది. భారత నౌక దళ అవసరాలను చాలా వరకు ఈ నేవీ రాఫెల్ జెట్స్ తీరుస్తాయని డసాల్ట్ ఏవియేషన్ ప్రకటించింది. ఫ్రాన్స్ ఏవియేషన్- భారత సైన్యం మధ్య రక్షణ ఒప్పందాల్లో కీలక ముందడుగా అభివర్ణించింది. నౌకా దళం కోసం 26 రాఫెల్ మెరైన్ విమానాల కొనుగోలుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన భారత రక్షణ సముపార్జన మండలి (DAC) గురువారం ఆమోదం తెలిపింది.
ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలతోనూ సమావేశమైన మోదీ(PM Modi ), భారత్‌లో చేపడుతున్న ఆర్థిక సంస్కరణలు గురించి వివరించారు. అందుకు అనుగుణంగా అవకాశాలను అందుపుచ్చుకోవాలని కోరారు. భారత్-ఫ్రాన్స్ 25 ఏళ్ల బంధంలో ఇరు దేశాల వ్యాపారవేత్తల పెద్ద పాత్ర పోషించారని మోదీ తెలిపారు. ఈ సమావేశానికి ఫ్రాన్స్ నుంచి 16 మంది సీఈవోలు, భారత్ నుంచి 24 మంది సీఈవోలు హాజరైనట్లు భారత విదేశాంగశాఖ తెలిపింది. భారత్- ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో, ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడంలో , ఇరు దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు చేస్తున్న కృషిని మోదీ అభినందిచారని పేర్కొంది.