INDIA: నేటి నుంచి ఇండియా ఫ్రంట్‌ కీలక చర్చలు

ముంబైలో నేటి నుంచి ఇండియా ఫ్రంట్‌ నేతల సమావేశం.... కూటమి లోగో విడుదల చేసే అవకాశం..

Update: 2023-08-31 01:30 GMT

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా అధికార- ప్రతిపక్ష కూటములు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఈ వ్యూహాలకు ఇప్పుడు ముంబయి(mumbai) వేదిక కానుంది. ఇవాళ, రేపు(two-day conclave ) విపక్ష కూటమి ఇండియా ఫ్రంట్‌ నేతలు(opposition INDIA bloc) ముంబయిలో మూడో సమావేశం(third meet) నిర్వహించనున్నారు. పాట్నాలో మొదటిసారి సమావేశమైన ప్రతిపక్ష పార్టీల నేతలు వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(bjp)ని గద్దె దింపేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించారు. బెంగళూరులో రెండో సమావేశం నిర్వహించిన నేతలు కూటమి పేరును ఇండియా(india front)గా ఖరారు చేశారు. నేటి నుంచి ముంబయిలో జరగనున్న మూడో భేటీ(Mumbai meeting)లో ఇండియా కూటమి లోగో(logo for the alliance )ను విడుదల చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో భాజపా సారథ్యంలోని ఎన్డీయే ప్రచారాన్ని ఎదుర్కొనే వ్యూహంతోపాటు సీట్ల సర్దుబాటు, విపక్ష పార్టీల మధ్య విభేదాలను పరిష్కరించుకోవటమే అజెండా అని విపక్ష కూటమి(opposition front) నేతలు తెలిపారు.


విపక్ష కూటమి(alliance ) భేటీకి సోనియాగాంధీ(sonia gandhi) కూడా హాజరుకానున్నట్లు కాంగ్రెస్‌ నేతలు ప్రకటించారు. ఇప్పటికే విపక్ష కూటమికి చెందిన ముఖ్యనేతలు మమతా బెనర్జీ, లాలు ప్రసాద్‌ యాదవ్‌ ముంబయి చేరుకున్నారు. గత భేటీలకు 26పార్టీలకు చెందిన నేతలు హాజరు కాగా ఇవాళ్టి నుంచి మొదలయ్యే మూడో భేటికి 28పార్టీల నుంచి 63మంది ప్రతినిధులు హాజరవుతారని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ తెలిపారు. ఇండియా కూటమిలో చేరనున్న మరో రెండు పార్టీలేవీ అనేది వెల్లడించలేదు.


దేశంలో రాజకీయ మార్పు తీసుకురావడానికి ప్రతిపక్ష కూటమి బలమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని శరద్‌ పవార్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. ఎన్సీపీ విషయంలో ఎలాంటి గందరగోళం లేదన్న ఆయన పార్టీ వీడిన వారికి ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారని చురకలు వేశారు. విపక్ష కూటమిలోని పార్టీల సిద్ధాంతాలు వేరైనా దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే ఏకైక లక్ష్యమని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే చెప్పారు. తమ కూటమిలో ప్రధాని అభ్యర్థులకు చాలా చాయిస్‌లు ఉన్నాయని, భారతీయ జనతా పార్టీ(bjp)కి మోదీ(modi) తప్ప మరో ఛాయిస్‌ లేదన్నారు. ఇండియాకు కన్వీనర్‌ ఎవరని పేర్కొనగా....మరి ఎన్డీయే కన్వీనర్‌ ఎవరని ఎదురుప్రశ్న వేశారు.

Tags:    

Similar News