Rafale Fighter Jets : భారత్‌కు మరో 114 రఫేల్ యుద్ధ విమానాలు.. ఫ్రాన్స్‌కు కేంద్రం అధికారిక ప్రతిపాదన
రక్షణ రంగంలో అతిపెద్ద ఒప్పందానికి ముందడుగు
భారత వైమానిక దళాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. ఫ్రాన్స్ నుంచి మరో 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన అధికారిక ప్రతిపాదన లేఖను రక్షణ శాఖ సిద్ధం చేసింది. త్వరలోనే ఈ లేఖను ఫ్రాన్స్ ప్రభుత్వానికి పంపించనున్నట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి. ఈ ఒప్పందం అమలులోకి వస్తే భారత వైమానిక దళ సామర్థ్యం మరింత పెరగనుంది.
భారత్‌లోనే భారీ స్థాయిలో తయారీ
ఈ రక్షణ ఒప్పందంలో భాగంగా సుమారు 90 రఫేల్ విమానాలను ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం కింద భారత్‌లోనే తయారు చేయాలని ప్రణాళిక సిద్ధమైంది. ఫ్రాన్స్‌కు చెందిన డసో ఏవియేషన్ సంస్థ భారత భాగస్వామ్య కంపెనీతో కలిసి ఈ విమానాలను ఉత్పత్తి చేయనుంది. మిగతా విమానాలను నేరుగా ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకోనున్నారు. ఫ్రాన్స్ నుంచి అధికారిక స్పందన వచ్చిన తర్వాత టెండర్ ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉంది.
స్వదేశీ సాంకేతికతకు ప్రాధాన్యం
రఫేల్ యుద్ధ విమానాల్లో కనీసం 50 శాతం వరకు భారతీయ సాంకేతికత, విడిభాగాలు ఉండేలా కేంద్ర ప్రభుత్వం పట్టుదలగా వ్యవహరిస్తోంది. ఈ ఒప్పందం ద్వారా భారతీయ రక్షణ రంగ సంస్థలకు మరింత అవకాశాలు కల్పించాలని ఫ్రాన్స్‌ను భారత్ కోరింది. భవిష్యత్తులో రక్షణ రంగంలో ఇరు దేశాలు కలిసి డిజైన్, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా సహకారం పెంచే దిశగా చర్చలు కొనసాగుతున్నాయి.
తగ్గనున్న నిర్వహణ వ్యయం
ప్రస్తుతం భారత వైమానిక దళంలో 36 రఫేల్ యుద్ధ విమానాలు సేవలందిస్తున్నాయి. అలాగే భారత నౌకాదళం కోసం మరో 26 రఫేల్-ఎమ్ విమానాల కొనుగోలు ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇప్పటికే భారత్‌లో రఫేల్ విమానాల నిర్వహణ, శిక్షణ మౌలిక వసతులు సిద్ధంగా ఉండటంతో, కొత్త విమానాలు చేరితే నిర్వహణ ఖర్చులు, పైలట్ల శిక్షణ వ్యయం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
తుది ఆమోదం తర్వాతే ఒప్పందం
ఈ భారీ రక్షణ కొనుగోలు ప్రతిపాదనకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇప్పటికే ప్రాథమిక అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఫ్రాన్స్ నుంచి ధరలు, డెలివరీ సమయం, సాంకేతిక సహకారం, లాజిస్టిక్స్ మద్దతు వంటి అంశాలపై అధికారిక సమాధానం రానుంది. అనంతరం ఇరు దేశాల మధ్య తుది చర్చలు జరగనున్నాయి. చివరగా ప్రధాని నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ