Pakistan Floods : వరదలతో పాకిస్థాన్‌లో వెయ్యి మందికి పైగా మృతి.. ఆదుకోనున్న భారత్..

Pakistan Floods : ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్తాన్‌లో వరదలు పోటెత్తాయి.;

Update: 2022-08-30 16:30 GMT

Pakistan Floods : ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్తాన్‌లో వరదలు పోటెత్తాయి. భారీ వరదలతో పాకిస్థాన్ అల్లాడుతోంది. సింధ్, బలూచిస్థాన్ ప్రావిన్స్ ప్రాంతాలు జలవలయంలో చిక్కుకున్నాయి. 100కు పైగా జిల్లాలు వరద బారినపడ్డాయి. ఇప్పటి వరకు 1000మందికి పైగా చనిపోయారు. 6లక్షలకు పైగా ఇళ్లు వరదల్లో ప్రభావితం అయ్యాయి. 3 కోట్ల మందికి పైగా ఈ వరద ప్రభావానికి గురయ్యారు.

పాకిస్థాన్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. పాకిస్తాన్ ద్రవ్యోల్భనం దిగజారింది. కూరగాయలు, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. దేశంలో ఆహార ద్రవ్యోల్బణం తలెత్తే పరిస్థితులు ఉన్నాయి. అయితే పొరుగుదేశం పాక్‌కు ఆపన్న హస్తం అందించేందుకు భారత్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పాక్ కు ఆహార సాయం అందించడంపై కేంద్రంలో అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోంది.

ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రధాని నరేంద్రమోడీ సంతాపం తెలిపారు. పాకిస్తాన్‌లో వరదల కారణంగా సంభవించిన విధ్వంసాన్ని చూసి బాధగా ఉందని.. ఈ ప్రకృతి విపత్తులో బాధిత కుటుంబాలకు మోడీ సానుభూతి తెలియజేశారు. గతంలో కూడా 2010 వరదల్లో, 2005 భూకంపంలో భారత దేశం, పాకిస్తాన్ కు సహాయం చేసింది.

Tags:    

Similar News