Operation Sindoor: ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ ఆర్మీ సిబ్బంది వీరే

పేర్లను విడుదల చేసిన భారత్;

Update: 2025-05-12 02:28 GMT

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పైక్ పై ఆపరేషన్ సింధూర్ ప్రకటించింది. మే 7న పాక్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన అనేక మంది పాకిస్తాన్ ఆర్మీ అధికారులు, సిబ్బందిని చూపించే వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భారత సాయుధ దళాలు అంత్యక్రియలకు హాజరైన పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది, పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన కీలక పోలీసు అధికారుల పేర్లను విడుదల చేశాయి. అయితే పాకిస్తాన్ మాత్రం అంత్యక్రియల్లో పాల్గొనలేదని వాధించినప్పటికీ, భారత్ ఫొటోలు రిలీజ్ చేయడంతో పాక్ గొంతులో వెలక్కాయ పడ్డట్లైపోయింది.

ఎవరెవరంటే ? 

లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హుస్సేన్ షా, లాహోర్ IV కార్ప్స్ కమాండర్

లాహోర్ 11వ పదాతిదళ విభాగానికి చెందిన మేజర్ జనరల్ రావు ఇమ్రాన్ సర్తాజ్

బ్రిగేడియర్ మహ్మద్ ఫుర్కాన్ షబ్బీర్

డాక్టర్ ఉస్మాన్ అన్వర్, పంజాబ్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్

మాలిక్ సోహైబ్ అహ్మద్ భెర్త్, పంజాబ్ ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యుడు

లాహోర్ సమీపంలోని మురిద్కేలోని ఉగ్రవాద శిబిరంపై భారత దాడుల్లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదుల కోసం లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రవూఫ్ అంత్యక్రియల ప్రార్థనలకు నాయకత్వం వహించాడు. పౌర అధికారులు, హఫీజ్ సయీద్ స్థాపించిన నిషేధిత జమాత్-ఉద్-దవా (జెయుడి) సభ్యులు కూడా హాజరయ్యారు. మరణించిన వారిలో ఖారీ అబ్దుల్ మాలిక్, ఖలీద్, ముదస్సిర్ ఉన్నారు.

మే 8న ఉగ్రవాదులకు “ప్రభుత్వ అంత్యక్రియలు” నిర్వహించడాన్ని భారతదేశం తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదులకు “ప్రభుత్వ అంత్యక్రియలు” నిర్వహించడం పాకిస్తాన్‌లో ఒక ఆచారంగా మారి ఉండవచ్చని విమర్శించింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ విలేకరుల సమావేశంలో.. హతమైన ఉగ్రవాదుల శవపేటికల వెనుక యూనిఫాం ధరించిన పాకిస్తాన్ సైన్యం, పోలీసు సిబ్బంది ప్రార్థన చేస్తున్న ఫొటోలను చూపిస్తూ, ఈ చిత్రం ఏ సందేశాన్ని ఇస్తుందని ప్రశ్నించారు.

Tags:    

Similar News