Ariha Case: ఆ చిన్నారిని భారత్‌కు రప్పిస్తాం

జర్మనీలో చిక్కుకుపోయిన చిన్నారిని రప్పించేందుకు కేంద్రం చర్యలు.. జర్మన్‌ రాయబారికి సమస్య వివరణ...

Update: 2023-08-04 01:00 GMT

జర్మనీ(Germany)లో ఏడాదిన్నరగా చిక్కుకుపోయిన చిన్నారి అరిహా షా( baby girl Ariha Shah) కేసుపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. భారతీయురాలైన ఆ చిన్నారిని జర్మనీ(German) అధికారులు తమ కస్టడీలో ఉంచుకోవడం పసిపాప సాంస్కృతిక, ఇతర హక్కులకు భంగం కలిగించినట్లవుతుందని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది.ఈ విషయాన్ని జర్మన్‌ రాయబారి అకెర్‌మాన్‌కు వివరించామని విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి( Arindam Bagchi) వెల్లడించారు. అరిహా(Ariha )ను త్వరగా భారత్‌కు రప్పించేలా చూడాలని జర్మన్‌ రాయబారి(German Ambassador)ని కోరినట్లు తెలిపారు. తాము జర్మనీ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, ఆ చిన్నారిని పంపించమని ఒత్తిడి చేస్తూనే ఉంటామని బాగ్చి వెల్లడించారు.


కొందరు మహిళా ఎంపీలు(several women parliament members) విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జై శంకర్‌(External Affairs Minister S Jaishankar)ను కలిసి అరిహా తల్లిదండ్రుల ఆవేదన తీర్చాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీలు సుప్రియా సూలే, వందన చౌహాన్‌, జయాబచ్చన్‌, ప్రియాంక చతుర్వేది, రజనీ పాటిల్‌ ఆయనను కలిసి పాప తల్లిదండ్రుల ఆవేదనను వివరించి చెప్పారు. దీనిపై స్పందించిన జైశంకర్‌ పాపను తిరిగి తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జర్మనీ ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు వివరించారు.


ముంబైకి చెందిన భవేష్‌ షా, ధారా షా అనే దంపతులు 2018లో ఉపాధి కోసం జర్మనీకి వెళ్లారు. వారిద్దరికి అక్కడ అరిహా షా అనే పాప జన్మించింది. ఒకరోజు ఆ చిన్నారి ఆడుకుంటుండగా.. కింద పడింది. దీంతో చిన్నారి ప్రైవేటు పార్ట్ వద్ద దెబ్బ తగిలింది. వెంటనే ఆ చిన్నారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. కొన్ని రోజుల తర్వాత భవేష్ షా, ధారా షా దంపతులను ఆస్పత్రి వర్గాలు పిలిపించాయి. చిన్నారికి తగిలిన గాయాన్ని పరిశీలించి లైంగిక దాడి( parental abuse) జరిగి ఉండవచ్చని అనుమానించారు. దీంతో ఆ చిన్నారి సంరక్షణ బాధ్యతలను జర్మనీ అధికారులు తీసుకున్నారు.

2021 సెప్టెంబరు(Germany since September 2021 )లో ఈ ఘటన జరిగింది. అప్పటి నుంచి అరిహా జర్మనీ అధికారుల సంరక్షణలోనే ఉంటోంది. దీంతో అరిహా తల్లిదండ్రులు అప్పటి నుంచి న్యాయ పోరాటం సాగిస్తూనే ఉన్నారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు జరపగా లైంగిక వేధింపులు జరగలేదని కేసు మూసేశారు. పాపను అప్పగించాలని అప్పటి నుంచి జర్మనీలోని చిన్నారుల సంరక్షణ అధికారులను వేడుకున్నా వారు తల్లిదండ్రులపైనే తిరిగి కేసు పెట్టారు. తల్లిదండ్రులుగా పిల్లల్ని పెంచే అర్హతను నిరూపించుకోవాలని కోర్టు ఆదేశించడంతో చిన్నారి సంరక్షణ కేంద్రంలోనే ఉండిపోయింది. 

Tags:    

Similar News