భారత రక్షణ శాఖ తన కఠినమైన సోషల్ మీడియా నిబంధనలను కొంతమేర సడలించింది. దేశ రక్షణను దృష్టిలో ఉంచుకుని ఇప్పటివరకు ఉన్న ఆంక్షల్లో మార్పులు చేస్తూ, జవాన్లు మరియు సైనికాధికారులు ఇన్‌స్టాగ్రామ్ వీక్షించేందుకు అనుమతి కల్పించినట్లు సమాచారం. ఈ మేరకు ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ అన్ని యూనిట్లకు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.
నిబంధనలు ఇవే.. సైనికులు సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవచ్చు కానీ, అది కేవలం సమాచార సేకరణ (Passive usage) కోసం మాత్రమేనని రక్షణ శాఖ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ప్రధాన షరతులు ఇక్కడ ఉన్నాయి:
స్పందనలు నిషిద్ధం: ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు చేయడం, కామెంట్స్ పెట్టడం, వీడియోలు షేర్ చేయడం లేదా మెసేజ్‌లకు రియాక్ట్ అవ్వడం వంటివి చేయకూడదు.
పర్యవేక్షణ: ఫేస్బుక్, ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్ వంటి ఇతర మాధ్యమాలకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి.
భద్రత ముఖ్యం: నకిలీ వెబ్సైట్లు, వీపీఎన్ (VPN)లు మరియు వెబ్ ప్రాక్సీలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు.
సమాచారం అందించాలి: ఒకవేళ తమ ఖాతాల్లో తప్పుడు సమాచారం లేదా అనుమానాస్పద పోస్టులు కనిపిస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.