Naval anti-ship Missile: ఇండియన్ నేవీ మరో మైలురాయి.. యాంటి షిప్ మిస్సైల్ సక్సెస్..
Naval anti-ship Missile: నావల్ యాంటి షిప్ మిస్సైల్‌ను భారత నావికాదళం విజయవంతంగా పరీక్షించింది.;
Naval anti-ship Missile: నావల్ యాంటి షిప్ మిస్సైల్‌ను భారత నావికాదళం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఈ ప్రయోగం విజయవంతం అయిందని ఇండియన్ నేవీ ప్రకటించింది. 42B హెలికాప్టర్ నుంచి మిస్సైల్‌ను ప్రయోగించారు. నౌకలోని రక్షణ వ్యవస్థలను దాటుకుని ఆ మిస్సైల్ దూసుకెళ్తుందని నేవీ అధికారులు తెలిపారు. ఈ క్షిపణిని డీఆర్‌డీఓ రూపొందించింది. ఇండియా మొట్టమొదటిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన యాంటీ నావల్ మిస్సైల్ ఇదేనని భారత నావికాదళం ప్రకటించింది.