Narendra Modi: పెరిగిన ప్రధాని మోదీ ఆస్తులు.. మొత్తం విలువ ఎంతంటే..?
Narendra Modi: నరేంద్ర మోదీ ఆస్తులు పెరిగాయి.. ప్రతి ఏడాది తన ఆస్తుల వివరాలను అధికారికంగా వెల్లడిస్తున్నారు ప్రధాని..;
Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తులు పెరిగాయి.. ప్రతి ఏడాది తన ఆస్తుల వివరాలను అధికారికంగా వెల్లడిస్తున్నారు ప్రధాని.. ఈ ఏడాది కూడా ఆయన చరాస్తుల విలువ 26.13 లక్షలు పెరిగినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది.. గుజరాత్ రెసిడెన్షియల్ ప్లాట్‌లో ఆయనకు ఉన్న వాటాను విరాళంగా ఇచ్చారని, దీంతో ఆయన పేరిట ఎలాంటి స్థిరాస్తులు లేవని పేర్కొంది..
మోదీతోపాటు పలు కేంద్ర మంత్రుల ఆస్తుల జాబితాను పీఎంవో ప్రకటించింది.. మార్చి 31, 2022 వరకు మోదీ చరాస్తుల విలువ 2 కోట్ల 23 లక్షల 82 వేలా 504కు చేరినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం వివరాలను వెల్లడించింది.. ఇందులో డిపాజిట్ల పెరుగుదల, ఆర్థిక స్థిరత్వం, నేషన్ వైడ్ ఫైనాన్షియల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు, జీవిత బీమా కవరేజ్, బీమా పాలసీలు, నగదు ఉన్నాయని తెలిపింది.