Indigo Airlines: ఎయిర్ ఇండియా బాటలోనే ఇండిగో ఎయిర్‌లైన్స్..
ఢాకాకు విమానాల రాకపోకలు రద్దు;
బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ఎయిర్ ఇండియా ఆ దేశానికి విమానాల రాకపోకలను రద్దు చేసింది. షెడ్యూల్ ప్రకారం.. బంగ్లాదేశ్‌కు వెళ్లాల్సిన, బంగ్లాదేశ్ నుంచి రావాల్సిన ఎయిర్ ఇండియా సర్వీసులను నిలిపివేసింది. ఇప్పటికే విమాన టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులు.. తమ టికెట్లను రద్దు చేసుకున్నా.. లేదంటే రీషెడ్యూల్ చేసుకున్నా.. చార్జీల నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ఇప్పుడు ఎయిర్ ఇండియా బాటలోనే ఇండిగో ఎయిర్‌లైన్స్‌కూడా నడిచింది. షెడ్యూల్ ప్రకారం ఢాకాకు వెళ్లాల్సిన, ఢాకా నుంచి రావాల్సిన అన్ని ఇండిగో సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ‘బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రేపు షెడ్యూల్ ప్రకారం భారత్-ఢాకా మధ్య రాకపోకలు సాగించాల్సిన అన్ని ఇండిగో సర్వీసులను రద్దు చేశాం. ఈ నిర్ణయం వల్ల ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. అందుకు తాము పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాం.’ అని ఇండిగో తన ప్రకటనలో పేర్కొన్నది.
అంతకు ముందు ఎయిర్ ఇండియా కూడా ఇదే కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు తన విమానాల రాకపోకలను రద్దు చేసింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటన చేసింది. ఢాకాకు విమానాల రాకపోకల రద్దు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నది. షెడ్యూల్ ప్రకారం భారత్ నుంచి ఢాకాకు వెళ్లాల్సిన, ఢాకా నుంచి భారత్‌కు రావాల్సిన విమానాలను రద్దు చేసినట్లు తెలిపింది.
బంగ్లాదేశ్‌లో పరిస్థితిని తాము నిరంతరం పర్యవేక్షిస్తామని, ఇప్పటికే ఇండియా నుంచి ఢాకాకు, ఢాకా నుంచి ఇండియాకు విమాన టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు.. తమ టికెట్లను రీషెడ్యూల్ చేసుకున్నా, రద్దు చేసుకున్నా చార్జీల నుంచి పూర్తి మినహాయింపును ఇస్తామని ఎయిరిండియా స్పష్టంచేసింది. ‘మా అతిథులు, సిబ్బంది సంక్షేమమే మాకు తొలి ప్రాధాన్యం’ అని వెల్లడించారు.