Indian Army: చొరబాటుదారులే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్
భారత సరిహద్దులో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. చొరబాటుదారులే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్‌ను ముమ్మరంగా కొనసాగిస్తోంది.;
భారత సరిహద్దులో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. చొరబాటుదారులే లక్ష్యంగా సైన్యం సెర్చ్ ఆపరేషన్‌ను చేపట్టింది. పాకిస్తాన్ నుంచి సాధారణ పౌరుల వేషాల్లో ఉగ్రవాదులు జమ్ముకాశ్మీర్‌లో చొరబడుతున్నారన్న పక్కా సమాచారంతో పూంచ్ సెక్టార్‌లో భారీగా బలగాలు మోహరించాయి. చక్కన్ దా భాగ్ సెక్టార్‌లో స్థానిక పోలీసులతో కలిసి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల ముష్కరుల ఏరివేతే లక్ష్యంగా సోదాలు నిర్వహిస్తున్న ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. ఈ ఘటన తర్వాత భారత సరిహద్దుల్లో సైన్యం నిఘా పెంచింది.