Vijayashanti : విజయశాంతికి ఎమ్మెల్సీ ఇవ్వాలనేది ఏఐసీసీ నిర్ణయమా?

Update: 2025-03-12 06:45 GMT

కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ లేకపోయినా విజయశాంతికి ఎమ్మెల్సీ ఇవ్వడంపై దుమారం ఇంకా చల్లారలేదు. ఏఐసీసీ నేతలే స్వయంగా విజయశాంతికి ఫోన్ చేసి ఢిల్లీకి పిలిపించుకుని పదవి ఆఫర్ చేసినట్టు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. హైకమాండ్ లోని ఓ కీలక నేతతో ఆమె లాబీయింగ్ చేశారని మరికొందరు అంటున్నారు. పదవి కోసం ఆమె చాలా కాలంగా లాబీయింగ్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియమిస్తారనే ఊహగానాలు తొలుత వినిపించాయి. కానీ, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమెను పెద్దల సభకు పంపడానికి హైకమాండ్ మొగ్గుచూపినట్టు చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్, బీజేపీతో పనిచేసిన అనుభవం రాములమ్మకు ఉన్నది. దీంతో కేసీఆర్ ను ఎండగట్టడంతో పాటు బీజేపీని సైతం ఎటాక్ చేసే బాధ్యతలను ఢిల్లీ పెద్దలు ఆమెకు అప్పగించినట్టు తెలిసింది. ఒక్క ఎమ్మెల్సీతో సరిపుచ్చుతారా? భవిష్యత్ లో మరేదైనా పదవి ఇస్తారా? అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. 

Tags:    

Similar News