Israel-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి తీవ్రతరం, బీరూట్‌ను ఖాళీ చేయాలని హెచ్చరికలు

హిజ్బుల్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఐడీఎఫ్ భీకరదాడులు

Update: 2026-03-03 03:30 GMT

మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం మరింత ఉద్రిక్తమైంది. లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు తీవ్రతరం అయ్యాయి. ఇరాన్‌కు మద్దతుగా లెబనాన్ భూభాగం నుంచి ఇజ్రాయెల్‌పై రాకెట్లు, డ్రోన్లు ప్రయోగించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఇజ్రాయెల్ రక్షణ దళాలు (Israel Defense Forces – IDF) హిజ్బుల్లా స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తున్నాయి. Hezbollah కార్యకలాపాలు ఎక్కువగా ఉన్న బీరుట్ దక్షిణ ప్రాంతమైన దహియేపై తెల్లవారుజామున సుమారు 2:30 గంటలకు భారీ వైమానిక దాడి జరిపినట్లు సమాచారం.

ఇప్పటికే సోమవారం జరిగిన దాడుల్లో లెబనాన్ నిఘా విభాగానికి చెందిన అధికారులు సహా కనీసం 52 మంది మరణించినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. తాజా దాడులతో రాజధాని బీరుట్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దక్షిణ బీరుట్ ప్రాంతాన్ని తక్షణమే ఖాళీ చేయాలని IDF ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.

గాజాలో యుద్ధం కొనసాగుతున్న సమయంలో లెబనాన్ జోక్యం చేసుకోవడం వల్ల ఇరుదేశాల మధ్య ఘర్షణలు పెరిగిన విషయం తెలిసిందే. నవంబర్ 2024లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత పరిస్థితి కొంత స్థిరపడింది. అయితే ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ మరణం అనంతరం ప్రతీకార చర్యలుగా లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌పై దాడులు జరిగాయి.

దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్ రెండు వైపులా—ఇరాన్, లెబనాన్—ఘర్షణలను ఎదుర్కొంటున్న పరిస్థితి ఏర్పడింది. తాజా పరిణామాలు మధ్యప్రాచ్యంలో యుద్ధ విస్తరణకు దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News