CHANDRAYAAN 3: చంద్రుడి దిశగా మరో అడుగు
చంద్రయాన్ 3 వ్యోమనౌక కక్ష్య తగ్గింపు ప్రక్రియ విజయవంతంగా పూర్తి... అదిరిపోయిన జాబిల్లి ఫొటో...;
చంద్రయాన్ 3( CHANDRAYAAN 3) వ్యోమనౌకను జాబిలి కక్ష్యలో ప్రవేశించిన మరుసటి రోజు దాన్ని కక్ష్య తగ్గింపు ప్రక్రియ(orbit reduction)ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(Indian Space Research Organisation) విజయవంతంగా(successfully) పూర్తి చేసింది. చంద్రయాన్-3 ఇప్పుడు 170 ఇన్‌టు 4వేల 313 కిలోమీటర్ల కక్ష్యను చేరుకున్నట్లు తెలిపింది. వ్యోమనౌకలోని ఇంజిన్‌ను మండించడం( retrofiring of engines) ద్వారా కక్ష్య తగ్గింపును ప్రణాళికబద్దంగా పూర్తి చేసి చంద్రుడి ఉపరితలానికి మరింత దగ్గరకు తీసుకెళ్లామని( closer to the moon's surface) ఇస్రో( ISRO) ప్రకటించింది. తదుపరి కక్ష్య తగ్గింపు ప్రక్రియను ఆగస్టు 9న మధ్యాహ్నం ఒకటి- రెండు గంటల మధ్య నిర్వహిస్తామని ఇస్రో ప్రకటించింది. ఆ తర్వాత మరో రెండుసార్లు కూడా కక్ష్య తగ్గింపును చేపడతారు.
ఇలా దశల వారీగా వ్యోమనౌక ఎత్తును తగ్గించి, అంతిమంగా దానిని చంద్రుడి చుట్టూ ఉన్న వంద కిలోమీటర్ల వృత్తకార కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఇదంతా సజావుగా సాగితే ఈ నెల 23న చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెట్టనుంది. చంద్రయాన్-3 వేగాన్ని నిర్దిష్టంగా తగ్గించడం అత్యంత కీలకమని ఇస్రో ప్రకటించింది. . లేకుంటే అది చంద్రుడిని దాటి వెళ్లిపోవడమో లేక జాబిల్లి ఉపరితలాన్ని వేగంగా ఢీకొట్టడమో జరుగుతుందని వివరించింది.
జాబిలికి చేరువైన చంద్రయాన్ 3 వ్యోమనౌక తొలిసారి చంద్రుడి ఉపరితలాన్ని తన కెమెరాలో బంధించింది. ఆ ఫొటోలను ఇస్రో విడుదల చేసింది. శనివారం లునార్‌ఆర్బిట్ ఇన్సర్షన్ ప్రక్రియ సమయంలో ఈ ఫొటోలను చంద్రయాన్ తీసినట్లు ఇస్రో పేర్కొంది. జాబిలి కక్ష్యలో ప్రవేశించిన వెంటనే తాను చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిని అనుభవిస్తున్నానని.. చంద్రయాన్ 3 ఇస్రోకు తొలిసారి సందేశం పంపిందని వివరించింది.
చంద్రయాన్ ప్రాజెక్ట్స్‌లో భాగంగా ఇస్రో ఇప్పటివరకు మూడు ప్రయోగాలు చేపట్టింది . మొదటి ప్రయోగమైన చంద్రయాన్ 1 విజయవంతమైంది. 2019లో చేపట్టిన రెండో ప్రయోగం.. చంద్రయాన్ 2 విఫలమైంది. జాబిల్లిపై ల్యాండర్‌ను మృదువుగా దించడంతో ఇస్రో వైఫల్యం చవిచూసింది. దీనితో పూర్తి జాగ్రత్తలు తీసుకుని, సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసి , చంద్రయాన్ 3ని సిద్ధం చేసింది ఇస్రో. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశంగా అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ నిలవనుంది.