Venus mission : త్వరలో శుక్ర గ్రహంపై ఇస్రో పరిశోధనలు

భారత రాకెట్లలో 95 శాతం విడిభాగాలు స్వదేశీవే;

Update: 2023-09-27 04:00 GMT

 చంద్రుడు, అంగారక మిషన్‌లను విజయవంతంగా పూర్తి చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తదుపరి శుక్రుడిపై ప్రయోగానికి సిద్ధంగా ఉంది. సౌర వ్యవస్థలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం అయిన శుక్రుడి పై భారత మిషన్ చేపట్టనుందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ మంగళవారం ప్రకటించారు. వాతావరణం కలిగి, నివాసయోగ్యమైన గ్రహాలు, నక్షత్రాలు, ఎక్సో-ప్లానెట్ల రహస్యాలు ఛేదించే దిశగా దృష్టి సారిస్తామని   వివరించారు. ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడమీ(ఐఎన్‌ఎ్‌సఏ) మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. శుక్ర గ్రహాన్ని అధ్యయనం చేయడానికి ఒక మిషన్‌, అంతరిక్ష వాతావరణం.. భూమిపై దాని ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి మరో రెండు ఉపగ్రహాలను సిద్ధం చేసే పనిలో ఉన్నామని చెప్పారు.శుక్రగ్రహం చాలా ఆసక్తికరమైన గ్రహమని, దీని వాతావరణ పీడనం భూమి కంటే 100 రెట్లు ఎక్కువ అని ఆయన చెప్పారు. నాసా భవిష్యత్తులో వీనస్ మిషన్లు 2029, 2030, 2031లో చేపట్టే అవకాశం ఉంది.


అలాగే అంగారక గ్రహంపై వ్యోమనౌకను దింపే ప్రాజెక్టును కూడా రూపొందిస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా, రాకెట్ డిజైన్, తయారీతోపాటు, వాటిలో ఉపయోగించే ముఖ్య విడిభాగాలైన ప్రాసెసర్,కంప్యూటర్ చిప్స్ వంటి వాటిని కూడా దేశీయంగా తయారు చేస్తున్నట్టు తెలిపారు. “ అంతరిక్ష పరిశోధనల కోసం అవసరమయ్యే సాంకేతికత, రాకెట్ , ఉపగ్రహాల తయారీ, స్పేస్ అప్లికేషన్స్ వంటి వాటిని దేశం లోని వివిధ జాతీయ పరిశోధన సంస్థలతో కలిసి ఇస్రో రూపొందిస్తుంది. వాటితోపాటు ఎలక్ట్రోమెకానికల్ యాక్యుయేటర్స్, డీసీ పవర్ సప్లయ్ సిస్టమ్స్, బ్యాటరీ సిస్టమ్స్, సోలార్ సెల్స్‌ను కూడా జాతీయ పరిశోధన సంస్థలతో కలిసి ఇస్రో అభివృద్ధి చేసింది ” అని సోమనాథ్ తెలిపారు. రాకెట్ల తయారీలో ఉపయోగించే   విడిభాగాలను భారత్‌ నుంచే సేకరించినట్టు ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ వెల్లడించారు.


సిఎస్‌ఐఆర్ ( కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి )r 82వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మట్లాడారు. సిఎస్‌ఐఆర్   వంటి దేశీయ పరిశోధనా ల్యాబ్‌ల సహకారంతోనే ఈ ఘనత సాధించగలిగామన్నారు. సిఎస్‌ఐఆర్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 12 మంది యువ శాస్త్రవేత్తలకు శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ అవార్డులను సోమనాథ్‌ అందజేశారు. 

Tags:    

Similar News