Acharya Vidhyasagar Maharaj: జైన ముని ఆచార్య విద్యాసాగర్ జీ మహారాజ్ కన్నుమూత

సంతాపం తెలిపిన ప్రధాని

Update: 2024-02-18 06:15 GMT

జైన ముని ఆచార్య శ్రీ విద్యాసాగర్ జీ మహారాజ్ కన్నుమూశారు. ఛత్తీస్‌గఢ్‌లోని డోంగర్‌ఘర్‌లో ఉన్న చంద్రగిరి తీర్థంలో ఉండే విద్యాసాగర్ జీ మహరాజ్.. కన్నుమూసినట్లు చంద్రగిరి తీర్థంలో ఉండే ఆయన సన్నిహితులు వెల్లడించారు. ఆదివారం తెల్లవారుజామున 2.35 గంటలకు విద్యాసాగర్ జీ మహరాజ్ చనిపోయినట్లు ప్రకటించారు. అయితే గత 3 రోజుల నుంచి మహారాజ్ ఆహారం, నీరు తీసుకోవడం మానేశారని వారు వెల్లడించారు. విద్యాసాగర్ జీ మహరాజ్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

ఎక్స్ వేదికగా ఆచార్య విద్యాసాగర్ మహరాజ్ మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. "నా ఆలోచనలు, ప్రార్థనలు ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ జీ మహారాజ్ భక్తులతో ఉన్నాయి. సమాజానికి మహరాజ్ చేసిన అమూల్యమైన కృషికి, ముఖ్యంగా ప్రజల్లో ఆధ్యాత్మికతన పెంపొందించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు, పేదరిక నిర్మూలన, వైద్యం, విద్య, మరిన్నింటి కోసం చేసిన కృషికి రాబోయే తరాలకు గుర్తుండిపోతాయి. ఆయన ఆశీస్సులు అందుకున్న ఘనత నాకు దక్కింది. గత ఏడాది చివర్లో ఛత్తీస్‌గఢ్‌లోని డోంగర్‌ఘర్‌లోని చంద్రగిరి జైన మందిరాన్ని సందర్శించడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సమయంలో నేను విద్యాసాగర్ జీ మహారాజ్ జీని కలిసి వారి ఆశీస్సులు కూడా పొందాను" అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News